‘స్పందన’కు 250 వినతులు

జిల్లాలో పెండింగ్‌లో ఉన్న కారుణ్య

వినతులు స్వీకరిస్తున్న కలెక్టర్‌ మనజీర్‌ జిలానీ సమూన్‌

ప్రజాశక్తి- శ్రీకాకుళం అర్బన్‌

జిల్లాలో పెండింగ్‌లో ఉన్న కారుణ్య నియామకాలు చేపట్టాలని, అలాగే ఉద్యోగుల స్పందన కార్యక్రమాన్ని కొనసాగించాలని ఎపి ఎన్‌జిఒ రాష్ట్ర సహాధ్యక్షులు చౌదరి పురుషోత్తంనాయుడు, జిల్లా అధ్యక్షులు హనుమంతు సాయిరాం విన్నవించారు. జిల్లా పరిషత్‌ సమావేశ మందిరంలో కలెక్టర్‌ డాక్టర్‌ మనజీర్‌ జిలానీ సమూన్‌ ఆధ్వర్యాన సోమవారం నిర్వహించిన స్పందనలో వినతిపత్రం అందజేశారు. అలాగే జిల్లాలోని ప్రభుత్వ సర్వజనాస్పత్రిలో తాత్కాలికంగా నిర్వహిస్తున్న ప్రభుత్వ నర్సింగ్‌ కళాశాలకు ప్రత్యామ్నాయంగా సింగుపురం సమీపాన నూతన భవన నిర్మాణాలు త్వరితగతిన పూర్తి చేసి అదనపు సౌకర్యాలు కల్పించాలని కళాశాల ప్రిన్సిపాల్‌ డాక్టర్‌ కళావతమ్మ కోరారు. ప్రస్తుతం రిమ్స్‌ వైద్య కళాశాలలో వసతి సౌకర్యం లేక ఇబ్బందులు పడుతున్నట్టు వివరించారు. పోలాకి మండలం మబుగాంకు చెందిన ధర్మాన విశ్వనాథం తన భూమి ప్రభుత్వ అవసరానికి గతంలో సేకరించారని, పరిహారం చెల్లించలేదని తన వ్యక్తిగత ఖాతాకు పరిహారం జమచేయాలని కోరారు. శ్రీకాకుళం రూరల్‌ మండలం కిల్లిపాలెంకు చెందిన వికలాంగురాలు సోడిముడి లక్ష్మి తనకు జగనన్న కాలనీలో ఇల్లు మంజూరు చేయాలని కోరారు. సంతబొమ్మాళికి చెందిన గాయశ్రీ కేశవరావు, కండ్రకు చెందిన తనకు బిసి-ఎ కుల ధ్రువీకరణ పత్రం అందజేయాలని కోరారు. సారవకోట మండలం గోరిబందకు చెందిన జన్ని బుజ్జి గ్రామంలో ఇంటి నిర్మాణం చేపట్టామని, ఇప్పటి వరకు నిర్మాణ పనులకు సంబంధించి బిల్లు మంజురు కాలేదని, బిల్లు మంజూరు చేయాలని విన్నవించారు. పలు సమస్యలపై జిల్లావ్యాప్తంగా వచ్చిన 250 వినతులను జాయింట్‌ ఎం.నవీన్‌, స్పెషల్‌ డిప్యూటీ కలెక్టర్‌ రామ్మోహనరావు, డిఆర్‌డిఎ పీడీ విద్యాసాగర్‌ స్వీకరించారు. అనంతరం కలెక్టర్‌ మాట్లాడుతూ అర్జీలను, పెండింగ్‌లో ఉన్న దరఖాస్తులను సత్వరమే పరిష్కరించాలని సంబంధిత అధికారులకు ఆదేశించారు. రిజిస్ట్రేషన్‌ ప్రక్రియ పరిశీలనజెడ్‌పిలో చేపడుతున్న పౌర సరఫÛరాలు, గృహనిర్మాణ శాఖ, రెవెన్యూ, వికలాంగులశాఖ, వైద్య ఆరోగ్యశాఖలు చేపడుతున్న రిజిస్ట్రేషన్‌ ప్రక్రియ విధానాన్ని కలెక్టర్‌ అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఖేలో ఇండియా విజేతలుగా నలిచిన క్రీడాకారులను అభినందించారు. అంతకుముందు నులిపురుగుల నివారణ వారోత్సవాల పోస్టర్‌ను ఆవిష్కరించారు. కార్యక్రమంలో పలు శాఖల జిల్లా అధికారులు పాల్గొన్నారు.

 

 

➡️