హామీలను అమలు చేయాల్సిందే

Mar 5,2024 21:00

ప్రజాశక్తి-పలాస : జీడి పంటకు మద్దతు ధర, పిక్కలను ప్రభుత్వమే రైతు భరోసా కేంద్రాల ద్వారా కొనుగోలుపై సిఎంఒ అధికారులతో జరిగిన చర్చల్లో హామీలు తక్షణమే అమలు చేయాలని జీడి రైతు సంఘం జిల్లా కన్వీనర్‌ తెప్పల అజరుకుమార్‌ ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు. కాశీబుగ్గ అమ్మ ఆశ్రమం వద్ద వామపక్ష నాయకులతో మంగళవారం సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఫిబ్రవరి ఒకటో తేదీన మంత్రి సీదిరి అప్పలరాజు, సిఎంఒ ధనుంజయరెడ్డితో జీడిపంటపై చర్చలు జరగాయని, అందులో ఇచ్చిన హామీలను నెల రోజులు కావస్తున్నా అమలు చేయడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. జీడి పంటను పంటల జాబితాలో చేర్చి రైతు భరోసా కేంద్రాల ద్వారా కొనుగోలుకు హామీ ఇచ్చారన్నారు. ఉద్యాన శాఖాధికారులు, కమిషనరుతో కలిసి స్వామినాథన్‌ కమిషన్‌ సిపార్సు మేరకు మద్దతు ధర నిర్ణయించేందుకు హామీ ఇచ్చారన్నారు. వెంటనే హామీలను అమలు చేయాలని డిమాండ్‌ చేశారు. సమావేశంలో ఎపి రైతు సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు కోనారి మోహనరావు, సిపిఐ నాయకులు చాపర వేణుగోపాల్‌, సిఐటియు జిల్లా కార్యదర్శి ఎన్‌.గణపతి, సిపిఐ ఎంఎల్‌ లిబరేషన్‌ నాయకులు మద్దిల రామారావు, రైతు సంఘం నాయకులు కొర్ల హేమారావు చౌదరి, కోనేరు గురయ్య, ఎం.జోగారావు, కుత్తుం ఢిల్లీరావు, వంకల అప్పయ్య, డి.శ్రీనివాసరావు పాల్గొన్నారు.

➡️