22న ఓటర్ల తుది జాబితా

వచ్చే సార్వత్రిక ఎన్నికల

మాట్లాడుతున్న కలెక్టర్‌ శ్రీకేష్‌ లాఠకర్‌

  • రాజకీయ పార్టీల ఫిర్యాదుల పరిష్కారానికి ప్రాధాన్యత
  • కలెక్టర్‌ శ్రీకేష్‌ లాఠకర్‌

ప్రజాశక్తి – శ్రీకాకుళం అర్బన్‌

వచ్చే సార్వత్రిక ఎన్నికల కోసం పూర్తిస్థాయి ఓటర్ల తుదిజాబితాను ఈనెల 22వ తేదీన విడుదల చేయనున్నట్లు కలెక్టర్‌ శ్రీకేష్‌ లాఠకర్‌ తెలిపారు. కలెక్టరేట్‌లోని సమావేశ మందిరంలో రాజకీయ పార్టీల ప్రతినిధులతో 26వ వారపు సమావేశాన్ని గురువారం నిర్వహించారు. రాజకీయ పార్టీల ప్రతినిధుల అనుమానాలను నివృత్తి చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఓటర్ల జాబితాలో లోపాలను సరిదిద్దడానికి రాజకీయ పార్టీలు అందించే వినతులు, ఫిర్యాదులను క్షేత్రస్థాయిలో పరిశీలించి త్వరితగతిన పరిష్కరించేందుకు అత్యంత ప్రాధాన్యత ఇస్తున్నట్లు తెలిపారు. ఫారం-6, 7, 8కు సంబంధించిన తుది పరిశీలన పూర్తయిందని చెప్పారు. ఎన్నికల నిబంధనలు తుచా తప్పక పాటించనున్నట్లు స్పష్టం చేశారు. డిసెంబరు తొమ్మిదో తేదీ తర్వాత వచ్చిన దరఖాస్తులు పరిగణనలోకి తీసుకోవడం జరగదన్నారు. పెండింగ్‌లో ఉన్న సమస్యలు త్వరలోనే పరిష్కరించనున్నట్లు తెలిపారు. బిఎల్‌ఒ స్థాయిలో దరఖాస్తులు పరిశీలించినట్లు చెప్పారు. ఎటువంటి పొరపాట్లు చోటుచేసుకున్నా బిఎల్‌ఒలదే బాధ్యత అని అన్నారు. అభ్యంతరాలపై పూర్తిస్థాయిలో చర్యలు చేపట్టనున్నట్లు తెలిపారు. ఓటరు వివరాలు హ్యాండ్‌ బుక్‌ ఇసిఐ వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉందన్నారు. ఈనెల 12వ తేదీ నాటికి అన్నిస్థాయిల్లో క్లయిమ్‌లకు పరిష్కారం లభిస్తుందన్నారు. రాజకీయ పార్టీల ప్రతినిధులు కోరినట్టుగానే డబుల్‌ ఎంట్రీ, పోలింగ్‌ బూత్‌లు తదితర అంశాలపై నివేదిక అందజేస్తామన్నారు. సమావేశంలో జిల్లా రెవెన్యూ అధికారి ఎం.గణపతిరావు, వైసిపి నాయకులు రౌతు శంకరరావు, టిడిపి నాయకులు పి.ఎం.జె బాబు, బిఎస్‌పి నాయకులు ఎల్‌.సోమేశ్వరరావు, బిజెపి నాయకులు పసుపులేటి సురేష్‌బాబు సింగ్‌, సి-సెక్షన్‌ సూపరింటెండెంట్‌ ప్రకాశరావు, డిటి చక్రవర్తి తదితరులు పాల్గొన్నారు.

 

➡️