టిడిపి అభ్యర్థులకు బిఫామ్‌లు

సార్వత్రిక ఎన్నికల్లో

బిఫామ్‌లను అందుకుంటున్న టిడిపి అభ్యర్థులు

ప్రజాశక్తి – శ్రీకాకుళం అర్బన్‌

సార్వత్రిక ఎన్నికల్లో శ్రీకాకుళం పార్లమెంట్‌, అసెంబ్లీ నియోజకవర్గాలకు పోటీ చేస్తున్న తెలుగుదేశం పార్టీ అభ్యర్థులకు ఆ పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు బిఫామ్‌లు అందజేశారు. ఉండవల్లిలోని చంద్రబాబు నివాసంలో ఆదివారం శ్రీకాకుళం పార్లమెంట్‌ అభ్యర్థి కింజరాపు రామ్మోహన్‌ నాయుడుతో పాటు ఏడు శాసనసభా నియోజకవర్గాల అభ్యర్థులకు అందజేశారు. బెందాళం అశోక్‌ (ఇచ్ఛాపురం), గౌతు శిరీష (పలాస), కింజరాపు అచ్చెన్నాయుడు (టెక్కలి), బగ్గు రమణమూర్తి (రమణమూర్తి), గొండు శంకర్‌ (శ్రీకాకుళం), కూన రవికుమార్‌ (ఆమదాలవలస), మామిడి గోవిందరావు (పాతపట్నం) చంద్రబాబు చేతుల మీదుగా బిఫామ్‌లను అందుకున్నారు. వైసిపి ప్రజా వ్యతిరేక విధానాలు, టిడిపి హామీ ఇచ్చిన సూపర్‌ సిక్స్‌ పథకాలను ప్రతి ఇంటికీ విస్తృత ప్రచారం చేయాలని చంద్రబాబు సూచించారు.

➡️