స్ట్రాంగ్‌రూమ్‌లు తనిఖీ

సార్వత్రిక ఎన్నికల పోలింగ్‌కు

రిజిస్టర్‌లో సంతకం చేస్తున్న ఎస్‌పి రాధిక

ప్రజాశక్తి – ఎచ్చెర్ల

సార్వత్రిక ఎన్నికల పోలింగ్‌కు సంబంధించి స్థానిక శివానీ ఇంజినీరింగ్‌ కళాశాలలో ఇవిఎంలు భద్రపరిచిన స్ట్రాంగ్‌రూమ్‌, కౌంటింగ్‌ కేంద్రాల భద్రతా ఏర్పాట్లను ఎస్‌పి జి.ఆర్‌ రాధిక సోమవారం పరిశీలించారు. స్ట్రాంగ్‌రూమ్‌లకు వేసిన సీల్‌, ప్రవేశమార్గం, వాహనాల పార్కింగ్‌ ప్రదేశాలు, కౌంటింగ్‌ కేంద్రాల వద్ద బార్కెట్ల ఏర్పాట్లు పరిశీలించడంతో పాటు రిజిస్టర్‌లో సంతకం చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ శ్రీకాకుళం పార్లమెంట్‌, ఎనిమిది అసెంబ్లీ స్థానాలకు సంబంధించి ఏర్పాటు చేసిన స్ట్రాంగ్‌రూమ్‌ల వద్ద భద్రతా ఏర్పాట్లను నిరంతరం పర్యవేక్షించాలని అధికారులను ఆదేశించారు. ప్లడ్‌లైట్స్‌ ఏర్పాటుతో పాటు సిసి కెమెరాల పర్యవేక్షణ లో అప్రమత్తంగా ఉండాలని సూచించారు. స్ట్రాంగ్‌రూముల వద్ద ఏర్పాటు చేసిన మూడంచెల కేంద్ర పోలీస్‌ బలగాల గార్డు, జిల్లా ఆర్మ్‌డ్‌ పోలీస్‌ గార్డు, సివిల్‌ పోలీస్‌ బందోబస్తును పరిశీలించి పలు సూచనలు చేశారు. స్ట్రాంగ్‌రూమ్‌కి నలువైపులా పటిష్ట భద్రతా ఏర్పాట్లు, నిరంతరం సిసి కెమెరాల పర్యవేక్షణపై ఆరా తీశారు. నిరంతరం సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని ఆదేశిం చారు. తనిఖీ అధికారులు నిరంతరం పహా రాను తనిఖీ చేయాలన్నారు. ఎస్‌పి వెంట ఎఎస్‌పి జి.ప్రేమకాజల్‌, డిఎస్‌పి వై.శ్రుతి, ఇతర పోలీసు అధికారులు పాల్గొన్నారు.

➡️