నడకతోనే ఆరోగ్యం

ఒత్తిడిని జయించడంతో పాటు ఆరోగ్యవంతమైన

మాట్లాడుతున్న డాక్టర్‌ గౌతమి

ప్రజాశక్తి – శ్రీకాకుళం అర్బన్‌

ఒత్తిడిని జయించడంతో పాటు ఆరోగ్యవంతమైన జీవనాన్ని సాగించడానికి నడక దివ్య ఔషధమని మూత్రపిండాల వైద్య నిపుణులు డాక్టర్‌ బెందాళం గౌతమి అన్నారు. ఆదివారం ఆర్ట్స్‌ కళాశాల మైదానంలో స్టార్‌ వాకర్స్‌ క్లబ్‌ ఆధ్వర్యాన ప్రపంచ ఆరోగ్య దినోత్సవ వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఈ ఏడాది నా ఆరోగ్యం – నా హక్కు అనే నినాదంతో ప్రపంచ వ్యాప్తంగా ఆరోగ్య దినోత్సవ వేడుకలు జరుపుకుంటున్నట్టు తెలిపారు. సంపూర్ణ ఆరోగ్యానికి ఆహారపు అలవాట్లే కీలకమన్నారు. శారీరిక శ్రమతో పాటు నడక, వ్యాయామం, యోగా, సమయానికి ఆహారం తీసుకోవడం వలన అనేక రకాల వ్యాధులు రాకుండా అడ్డుకోవచ్చన్నారు. కార్యక్రమంలో స్టార్‌ వాకర్స్‌ క్లబ్‌ కో-ఆర్డినేటర్‌ శాసపు జోగి నాయుడు, మాజీ గవర్నర్‌ జి. ఇందిరా ప్రసాద్‌, ఆర్ట్స్‌ కళాశాల ఎన్‌సిసి అధికారులు డాక్టర్‌ వై.పోలినాయుడు, బి.వరలక్ష్మి, పావని, స్టార్‌ వనితా నడక సంఘం అధ్యక్షరాలు జి. లక్ష్మీ, స్టార్‌ వాకర్స్‌ క్లబ్‌ కార్యదర్శి బి. దేవీ ప్రసాద్‌ పాల్గొన్నారు.

 

➡️