టిడిపిలో పలువురు చేరిక

నగరంలోని బర్మా కాలనీకి చెందిన పలువురు టిడిపిలో

శ్రీకాకుళం రూరల్‌ : టిడిపిలో చేరిన వారితో గొండు శంకర్‌

ప్రజాశక్తి – శ్రీకాకుళం అర్బన్‌, రూరల్‌

నగరంలోని బర్మా కాలనీకి చెందిన పలువురు టిడిపిలో చేరారు. టిడిపి నాయకులు అల్లంశెట్టి జనార్దనరావు, పేట పద్మల ఆధ్వర్యాన వైసిపికి చెందిన పలు కుటుంబాలు కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి గొండు శంకర్‌ సమక్షంలో పార్టీలో చేరారు. బెవర రమణ, రెడ్డి ఎర్రయ్యల నాయకత్వాన వీరంతా ఆయనను కలిశారు. పార్టీలో చేరిన వారికి కండువాలు వేసి పార్టీలోకి ఆహ్వానించారు. కార్యక్రమంలో పార్టీ నాయకులు రెడ్డి శంకర్‌ పాల్గొన్నారు. రూరల్‌ మండలంలోని భైరి 3వ వార్డు మెంబర్‌, వైసిపి నాయకులు గుండ లక్ష్మీనారాయణ తన అనుచరులు అంబటి జగదీష్‌, బైరి శ్రీరాములు తదితరులతో కలిసి ఎమ్మెల్యే అభ్యర్థి గొండు శంకర్‌ సమక్షంలో టిడిపిలో చేరారు. రామ్మోహన్‌ నాయుడును ఎంపీ, గొండు శంకర్‌ను ఎమ్మెల్యేగా గెలిపించేందుకు శంకర్‌ నాయకత్వంలో పని చేస్తామన్నారు. కార్యక్రమంలో టిడిపి నాయకులు అంబటి లక్ష్మి రాజ్యం, నక్క శంకరరావు, బిజెపి నాయకులు గొలివి కరుణాకరరావు, టిడిపి, జనసేన, బిజెపి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు

.పొందూరు : మండలం కింతలిలో టిడిపి జిల్లా అధ్యక్షుడు, నియోజకవర్గం టిడిపి ఎమ్మెల్యే అభ్యర్ధి కూన రవికుమార్‌ సమక్షంలో 95 కుటుంబాలు వైసిపి నుంచి టిడిపిలో చేరారు. గ్రామానికి చెందిన 14 మంది మాజీ సైనికులతో పాటు పలువురు వార్డు సభ్యులు ఉన్నారు. కార్యక్రమంలో సర్పంచ్‌ పైడి రాంప్రసాద్‌, ఎంపిటిసి కూటికుప్పల హనుమంతురావు, నియోజకవర్గం జనసేన ఇన్‌ఛార్జి పేడాడ రామ్మోహన్‌, టిడిపి మండల అధ్యక్షుడు చిగిలిపల్లి రామ్మోహన్‌, మాజీ సర్పంచ్‌ దవల గణపతిరావు, టిడిపి నాయకులు కిల్లి రామారావు, సింగూరు రామారావు, శేషగిరి, రాము, నారాయణరావు, వాసుదేవరావు తదితరులు పాల్గొన్నారు.

 

➡️