జాతీయస్థాయి ఆర్చరీ పోటీలకు నిహాల్‌

జిల్లాలోనే తొలిసారిగా రాష్ట్రస్థాయి ఆర్చరీ అసోసియేషన్‌ ఆఫ్‌ ఇండియా

జాతీయ స్థాయికి ఎంపికైన నిహాల్‌ రామ్‌తేజ్‌

ప్రజాశక్తి – శ్రీకాకుళం అర్బన్‌

జిల్లాలోనే తొలిసారిగా రాష్ట్రస్థాయి ఆర్చరీ అసోసియేషన్‌ ఆఫ్‌ ఇండియా ఎంపిక పోటీల్లో ఆదిత్య ఆర్చరీ అకాడమీ విద్యార్థి చెటికం నిహాల్‌ రామ్‌తేజ్‌ విజేతగా నిలిచి జాతీయస్థాయికి ఎంపికయ్యాడు. ఈనెల 24న విజయవాడ శాతవాహన కళాశాల వేదికగా జాతీయస్థాయి ఎంపిక పోటీల్లో అండర్‌-10 ఇండియన్‌ రౌండ్‌ విభాగంలో సత్తా చాటిన నిహాల్‌ ప్రథమ స్థానం దక్కించుకున్నాడు. ఆయన తండ్రి చంద్రమౌళి ఆదిత్య కన్‌స్ట్రక్షన్‌లో సివిల్‌ ఇంజినీర్‌గా పనిచేస్తున్నారు. ఈ పోటీల్లో జిల్లా నుంచి 15మంది పాల్గొన్నారు. వీరిలో బద్రి ప్రసాద్‌తేజ, బలగ భానుప్రసాద్‌, గుణపర్తి గుణశేఖర్‌, బాలా మోక్షజ్ఞ ఆదిత్య, కుప్పిలి దేవీచరణ్‌ అత్యుత్తమ ప్రతిభ కనబరిచారని ఆదిత్య ఆర్చరీ అకాడమీ డైరెక్టర్‌ రాజ్‌కుమార్‌ తెలిపారు. జిల్లా ఆర్చరీ సెక్రటరీ లోపింటి చిట్టిబాబు, ఒలింపిక్‌ అసోసియేషన్‌ జనరల్‌ సెక్రటరీ ఎ.సాంబమూర్తి, వ్యాయామ ఉపాధ్యాయ సంఘ అధ్యక్షులు ఎం.వి రమణ, అకాడమీ కోచ్‌లు ఆరిక భూషణరావు, ఎ.రాము, బి.సంగమేశ్వరరావు ఎంపికైన వారిని అభినందించారు.

 

➡️