కాంగ్రెస్‌తోనే పేదల జీవితాల్లో వెలుగు

కాంగ్రెస్‌ పార్టీతోనే పేదల జీవితాల్లో వెలుగులు

ఇంటింటా ప్రచారంలో పాల్గొన్న కాంగ్రెస్‌ అభ్యర్థి అన్నాజీరావు

ప్రజాశక్తి- ఆమదాలవలస

కాంగ్రెస్‌ పార్టీతోనే పేదల జీవితాల్లో వెలుగులు విరజిల్లుతాయని కాంగ్రెస్‌ పార్టీ అభ్యర్థి సనపల అన్నాజీరావు అన్నారు. సోమవారం మండలంలోని నిమ్మ తొర్లాడ, పాతూరు గ్రామాల్లో ఇంటింటా ప్రచారంలో పాల్గొన్నారు. ప్రతి ఇంటికి కాంగ్రెస్‌, ప్రతి ఇంటికి ప్రగతి అన్న నినాదంతో ముందుకు వెళ్తూ కాంగ్రెస్‌ పార్టీ అధికారంలోకి వస్తే చేయబోయే అభివృద్ధి పనులు, సంక్షేమంపై ప్రజలకు వివరి ంచారు. ఈ సందర్భంగా మాట్లాడు తూ అసమర్ధ పాలకులను తరిమి కొట్టి సమర్థవంతమైన నాయకు డిని, సుస్థిర పాలన అందించే కాంగ్రెస్‌ పార్టీని ఆదరించాలని ప్రజలను కోరారు. నిత్యావసర సరుకుల ధరలను తగ్గించి ప్రజలకు అందుబాటులో ధరలను ఉంచే ప్రజా ప్రభుత్వాన్ని తీసుకొస్తుందన్నారు. రానున్న ఎన్నికల్లో హస్తం గుర్తుపై ఓటు వేసి గెలిపించాలని కోరారు. కాంగ్రెస్‌ నాయకులు నారాయణరావు, వాసుదేవరావు, సందీప్‌, అప్పారావు, లఖినేని సునీల్‌ పాల్గొన్నారు.

 

➡️