మెట్టక్కివలసలో శంఖారావం

Mar 29,2024 17:02 #srikakulam

ప్రజాశక్తి-ఆమదాలవలస :- ఆమదాలవలస పురపాలక సంఘంలోని పదవ వార్డు పరిధిలోని హడ్కో కాలనీలో టిడిపి జిల్లా అధ్యక్షుడు నియోజకవర్గ ఇన్చార్జ్ కూన రవికుమార్ శంఖారావం కార్యక్రమంలో భాగంగా ఇంటింటికి వెళ్లి సూపర్ సెక్స్ పథకాలపై ప్రజలకు వివరించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ అరాచక ప్రభుత్వాన్ని సాగనంపి తెలుగుదేశం పార్టీని ఆదరించాలని ప్రజలను కోరారు. టిడిపి అధికారంలోకి రాగానే మేనిఫెస్టోలో ప్రకటించిన విధంగాసూపర్ సిక్స్ పథకాలను అమలు చేస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో మాజీ మున్సిపల్ చైర్మన్ తమ్మినేని గీత మాజీ వైస్ చైర్మన్ కూన వెంకటరాజ్య లక్ష్మి, టిడిపి నాయకులు నాగళ్ళ మురళీధర్, తంగి గురయ్య, సంపద రావు మురళి,లంక నాగరాజు, కూన బానోజీ రావు, చాపర సుధాకర్, కణితి విజయలక్ష్మి భాయ్, అన్నెపు భాస్కరరావు తదితరులు పాల్గొన్నారు.

➡️