కదం తొక్కిన అంగన్వాడీలు

Dec 22,2023 13:35 #srikakulam
sklm anganwadi workers strike on 11th day burja

రోడ్డుపై బైఠాయించిన కార్యకర్తలు
రంగ ప్రవేశం చేసిన పోలీసులు
ప్రజాశక్తి-బూర్జ : అంగన్వాడి కార్యకర్తలు కదం తొక్కారు. గత 11 రోజులుగా కార్యకర్తలు చేపట్టిన నిరావధికే సమ్మె విశ్వరూపం దాల్చింది శుక్రవారం నాడు పాలకొండ శ్రీకాకుళం సిహెచ్ రహదారిపై బూర్జి జంక్షన్ వద్ద కార్యకర్తలు బైటాయించారు. తమ సమస్యలను ప్రభుత్వం తక్షణమే పరిష్కారం చేయాలని కోరుతూ నినాదాలు చేశారు. రెండు గంటల కాలం ట్రాఫిక్ అంతరాయం ఏర్పడింది. ఇరువైపులా వందలాది వాహనాలు నిలిచిపోయాయి. సమస్యల పరిష్కారం కోసం ప్రభుత్వం తమ పోరాటం ఆగదని అంగన్వాడీలు స్పష్టం చేశారు. దీంతో పోలీసులు రంగ ప్రవేశం చేసి అంగన్వాడీలను రోడ్డు గడ్డంగా ఉన్న వారిని మహిళా కానిస్టేబుల్ పట్టుకొని తొలగించి ట్రాఫిక్ ను క్రమబద్ధీకరించారు. ఈ సందర్భంగా రాష్ట్ర పంచాయతీరాజ్ ఉపాధ్యాయులు అనేపు రామకృష్ణ మాట్లాడుతూ అంగన్వాడీల పట్ల ప్రభుత్వం చిన్నచూపు చూపడం సరికాదన్నారు. ప్రభుత్వం తక్షణమే స్పందించి వారి సమస్యలను పరిష్కరించేందుకు చూపాలని డిమాండ్ చేశారు గతంలో ముఖ్యమంత్రి వారికి ఇచ్చిన హామీని తక్షణమే నెరవేర్చాలని అన్నారు.
అంగన్వాడీలకు వేతనాలు పెంచాలని, గ్రాట్యూటి అమలు చేయాలని, సమస్యలు పరిష్కారం చేయాలని అన్నారు డిసెంబరు 12 నుండి చేపట్టిన నిరవధిక సమ్మె 11వ రోజు కొనసాగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గర్భవతులు, బాలింతలు, 6 సంవత్సరాల లోపు పిల్లలకు అంగన్వాడీలు అనేక సేవలందిస్తున్న కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కనీస వేతనాలు చెల్లించడంలేదని అన్నారు. అంగన్వాడీలకు సంక్షేమ పధకాలు అమలు చేయాలని అన్నారు మినీ సెంటర్లన్ని తక్షణమే మెయిన్ సెంటర్లుగా మార్చాలని, మినీ వర్కర్లకు ప్రమోషన్లు ఇవ్వాలని డిమాండ్‌ చేసారు. రిటైర్మెంట్ బెపిఫిట్ 5 లక్షలకు పెంచాలని, పెన్షన్ ఇవ్వాలని డిమాండ్‌ చేసారు. అంగన్వాడీల న్యాయమైన డిమాండ్లు పరిష్కరించే వరకు సమ్మె పోరాటం కొనసాగుతుందని అందుకు తెలుగుదేశం పార్టీ తరఫున వారికి మద్దతు తెలియజేస్తున్నామని అన్నారు వైసిపి ప్రభుత్వం మొండి వైఖరి వీడకుంటే తగిన గుణపాఠం తప్పదని తెలిపారు. ఈ కార్యక్రమంలో అంగన్వాడీ యూనియన్ నాయుకులు జ్యోతి, రాధిక తదితరులు పాల్గొన్నారు.

➡️