జీడి గిట్టుబాటు ధరపై ఉద్యమం ఉధృతం

జీడికి 80 కేజీల బస్తాకు

మాట్లాడుతున్న నాయకులు

ప్రజాశక్తి- పలాస

జీడికి 80 కేజీల బస్తాకు రూ.16 వేలు మద్దతు ధర ప్రకటించి రైతు భరోసా కేంద్రాల ద్వారా ప్రభుత్వమే కొనుగోలు చేసే వరకు ఉద్యమం ఉధృతం చేస్తామని జీడి రైతుల సంఘం జిల్లా కన్వీనర్‌ తెప్పల అజరు కుమార్‌, ఎపి రైతు సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు కోనారి మోహనరావు హెచ్చరించారు. కాశీబుగ్గ సిఐటియు కార్యాలయంలో జీడి రైతు కృష్ణారావు అధ్యక్షతన జీడి గిట్టుబాటు ధరపై జీడి రైతుల సమావేశం ఆదివారం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఈ ఏడాది పంట కాలంలో వర్షాభావ పరిస్థితిలో తీవ్ర పంట నష్టం వాటిల్లిందని అన్నారు. జీడి రైతులకు వాతావరణ బీమా అమలు చేసి ఆదుకోవాలని డిమాండ్‌ చేశారు. ఎన్నికల్లో వివిధ పార్టీలు జీడి రైతులకు హామీనిచ్చాయని అన్నారు. ఆ హామీలను నూతన ప్రభుత్వం ఏర్పడే దాకా, పిక్కలను ధర నిర్ణయించకుండా… దళారులకు అమ్మకూడదని నిర్ణయం తీసుకున్నారు. సమావేశంలో టి.భాస్కరరావు, కె.గురయ్య, అంబటి రామకృష్ణ, సిహెచ్‌.వేణుగోపాల్‌, యం.బాలానందం, టి.సురేష్‌, బి.మధు, వై.జోగారావు, అర్లి దానేసు, పి.ప్రకాష్‌, కె.రాజారావు, ఎన్‌.గణపతి పాల్గొన్నారు.

➡️