పంట నష్ట సర్వే ప్రారంభం

Dec 12,2023 16:17 #East Godavari

ప్రజాశక్తి-పెరవలి (తూర్పుగోదావరి జిల్లా) : మండలంలో అన్ని గ్రామాల్లో ఉద్యానవన పంటలు అరటి, కూరగాయ పంటలు, చిక్కుడు, కాకర,బీర,బొబ్బాయి తదితర పంటలు పంట నష్టం సర్వేను అధికారులు ప్రారంభించారు. కొవ్వూరు ఆర్టికల్చర్‌ ఆఫీసర్‌ శ్రీనివాస్‌ మాట్లాడుతూ.. పంట నష్టం సర్వే 18వ తేదీ వరకు చేయటం జరుగుతుందన్నారు. 24వ తేదీ నుండి మూడు రోజులు ఆయా గ్రామాల పరిధిలో రైతు భరోసా కేంద్రాల్లో డిస్ప్లే లిస్టు పెడతామని ఆయన తెలిపారు. తుఫాన్‌ ప్రభావం ఈదురు గాలులకు ఖండవల్లి ముక్కామల గ్రామాల్లో ఎక్కువ శాతం పంట నష్టం ఉందన్నారు. తుపాన్‌ ప్రభావంతో ఈదురు గాలులు భారీ వర్షాలకు పడిపోయి నీట మునిగి వరి చేలను పరిశీలించి పంట నష్ట సర్వే సోమవారం నుండి ప్రారంభించినట్టు మండల వ్యవసాయ అధికారి మేరీ కిరణ్‌ తెలిపారు.

➡️