టిడిపితోనే రాష్ట్రాభివృద్ధి

ప్రజాశక్తి-దర్శి : టిడిపితోనే రాష్ట్రాభివృద్ధి సాధ్యమని టిడిపి కూటమి దర్శి నియోజక అభ్యర్థి డాక్టర్‌ గొట్టిపాటి లక్ష్మి తెలిపారు. దర్శి నగర పంచాయతీలోని 9, 11వ వార్డుల్లో గురువారం ఇంటింటి ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా గొట్టిపాటి లక్ష్మి మాట్లాడుతూ టిడిపి హయాంలోనే దర్శి నియోజక వర్గ అభివృద్ధి చెందినట్లు తెలిపారు. ఈ సందర్భంగా టిడిపి నాయకులు లక్ష్మిని సన్మానించారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే నారపుశెట్టి పాపారావు, దర్శి నగర పంచాయతీ చైర్మన్‌ నారపుశెట్టి పిచ్చయ్య, పట్టణ అధ్యక్షుడు యాదగిరి వాసు, నాయకులు శోభారాణి, పుల్లలచెరువు చిన్న, దారం సుబ్బారావు, సంగు కొండలు, తిండి నారా యణరెడ్డి, కొండయ్య, తిరుపతిరావు తదితరులు పాల్గొన్నారు.టిడిపిలో చేరికదర్శి ఎఎంసి మాజీ చైర్మన్‌ రాచగొర్ల వెంకటయ్య ఆధ్వర్యంలో పలువురు టిడిపిలో చేరారు. టిడిపి కూటమి దర్శి నియోజక వర్గ అభ్యర్థి డాక్టర్‌ గొట్టిపాటి లక్ష్మి, ఆమె భర్త కడియాల లలిత సాగర్‌, మాగుంట రాఘవరెడ్డి, పమిడి రమేష్‌ ఆధ్వర్యంలో వారు పార్టీలో చేరారు. ఈ కార్యక్రమంలో టిడిపి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

➡️