నకిలీ, గుర్తింపు లేని విత్తనాలు విక్రయిస్తే కఠిన చర్యలు 

 పల్నాడు జిల్లా:  నకిలీ, గుర్తింపు లేని విత్తనాలు, పురుగు మం దులు విక్రయిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని వ్యవసాయ శాఖ ఏడిఏ పి.మస్తానమ్మ హెచ్చరిం చారు. నరసరావుపేట లోని పలు విత్తన,పురుగు మందుల దుకాణాలలో గురువారం ఎడిఎ పి.మస్తానమ్మ ఆకస్మిక దాడులు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ దుకాణదారులు నాణ్యమైన గుర్తింపు పొందిన విత్తనాలు పురుగు మందులు రైతులకు విక్ర యించాలని కొటేషన్‌ బిల్లు కాకుండా తప్పనిసరిగా వ్యవసాయ శాఖ ద్వారా అనుమతి పొందిన రసీదు మాత్రమే ఇవ్వాలని బిల్లుపై తప్పనిసరిగా రైతు సంతకం చేయించాలని సూచించారు. విత్తన ప్యాకెట్‌ తూకం, తయారీ తేదీ, కాలం చెల్లె తేదీ, ధరలు దుకాణంలో నల్ల బోర్డుపై ప్రదర్శించాలని అధిక ధరలకు విక్రయించినా రికార్డులు సక్రమంగా లేక పోయినా కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఆయా కంపెనీల అమ్మకపు అనుమతి పత్రాలు తప్పని సరిగా దుకాణంలో తనిఖీలకు వచ్చినపుడు తప్పనిసరిగా చూపిం చాలని, అమ్మకపు అనుమతి పత్రాలు లేకపోయినా బోర్డులో ప్రదర్శించిన నిల్వలకు రికార్డులలో నిల్వలకు వాస్తవ నిల్వలకు తేడా ఉన్నట్లు గమనిస్తే ఆయా నిల్వలు సీజ్‌ చేస్తామని హెచ్చరించారు. ప్రభుత్వ గుర్తింపు, అను మతి పొందిన విత్తనాలు మాత్రమే రైతులకు విక్రయిం చాలని రైతుల నుండి విత్తన మొలక, ఇతర ఫిర్యాదులు వస్తే దుకాణదారులు స్పందించాలని సూచించారు.

➡️