శాంతి భద్రతలకు విఘతం కలిగిస్తే కఠిన చర్యలు : సిఐ సోమశేఖర్‌

May 22,2024 16:00 #bapatla

ప్రజాశక్తి – చీరాల : ఎన్నికల కౌంటింగ్‌ జరగనున్న నేపథ్యంలో శాంతిభద్రతలకు విఘాతం కలిగిస్తూ ఘర్షణలకు పాల్పడితే కఠినమైన చర్యలు తప్పవని రెండవ పట్టణ సీఐ సోమశేఖర్‌ హెచ్చరించారు. బుధవారం చీరాల టూ టౌన్‌ పరిధిలో శృంగార పేటలో కార్డన్‌ అండ్‌ సెర్చ్‌ నిర్వహించారు. శృంగార పేట ఏరియా పరిధిలో ప్రతి ఇంటిని సోదా చేసి ఇంటి ఆవరణలో తనిఖీలు చేశారు. అదే విధంగా రౌడీ షీటర్స్‌ కూడా వారి ఇంటి వద్దనే కౌన్సిలింగ్‌ నిర్వహించారు. ఓట్ల లెక్కింపు ముందు, తర్వాత ఎటువంటి శాంతి భద్రతలకు విఘాతం కలిగకుండా చూసుకొవాల్సిన భాధ్యత ప్రజలందరి మీద ఉందన్నారు. శాంతి భద్రతలకు విఘాతం కలిగించే వారి సమాచారాన్ని తెలియజేయాలని కోరారు. పోలీసు ఉత్తర్వులను అతిక్రమిస్తేపై కేసులు నమోదు చేయడమే కాకుండా రౌడీ షీట్స్‌ను ఓపెన్‌ చేయడం జరుగుతుంది అని హెచ్చరించారు. అనంతరం ఆయా ప్రాంతాలలోని పలు వాహన తనిఖీలను నిర్వహించారు.

➡️