సమ్మె కాలపు వేతనం చెల్లించాలి : సిఐటియు

Feb 6,2024 15:19 #Annamayya district

ప్రజాశక్తి-రాజంపేట అర్బన్(అన్నమయ్య-జిల్లా) : తమ న్యాయమైన డిమాండ్ల సాధన కోసం అంగన్వాడీలు గత నెలలో మొత్తంగా చేపట్టిన సమ్మెకు సంబంధించిన 16 రోజుల వేతనం వెంటనే చెల్లించాలని సిఐటియు జిల్లా ఉపాధ్యక్షులు చిట్వేలి రవికుమార్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. సమ్మె కాలపు వేతనం విడుదల చేయాలని కోరుతూ మంగళవారం రాష్ట్రవ్యాప్తంగా మున్సిపల్ కార్మికులు మున్సిపల్ కార్యాలయం వద్ద నిరసన తెలిపారు. ఈ కార్యక్రమానికి అధ్యక్షత వహించిన చిట్వేలి రవికుమార్ మాట్లాడుతూ సమ్మె వేతనం చెల్లిస్తామని మాట చెప్పి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి మాట తప్పారని ఆరోపించారు. ఇప్పటికైనా మున్సిపల్ కార్మికుల సమ్మె కాలపు వేతనాలు చెల్లించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ వర్కర్స్ యూనియన్ జిల్లా అధ్యక్షులు సిహెచ్ ఓబయ్య, కార్మికులు లక్ష్మీదేవి, ప్రసాద్, బాలాజీ, రమణ, మధు, పెంచలయ్య తదితరులు పాల్గొన్నారు.

➡️