పన్ను సేకరించడంలో 100% లక్ష్యసాధన మార్కెట్ యార్డ్ చైర్మన్ సునీత

Apr 4,2024 17:52 #Anantapur District

ప్రజాశక్తి – పుట్లూరు : గత ఏడాది (2023 – 2024) ఆర్థిక సంవత్సరానికి సంబంధించి సింగనమల మార్కెట్ యార్డ్ నిర్దేశించిన పన్ను లక్షసాధన వందశాతం పైగానే లక్ష్యం సాధించినట్లు సింగనమల మార్కెట్ యార్డ్ కమిటీ చైర్మన్ భూమి రెడ్డి సునీత తెలిపారు. గురువారం కేంద్రంలో విలేకరుల సమావేశంలో మార్కెట్ యార్డ్ చైర్మన్ సునీత మాట్లాడుతూ మార్కెట్ యార్డ్ పరిధిలోని వివిధ రకాల పన్ను 75 లక్షల లక్ష్యాన్ని ఎంచుకోవడం జరిగింది. ఆ  లక్ష్యాన్ని మించి 101.22 లక్ష్యాన్ని చేయడం జరిగిందని తెలిపారు. ఇందుకు సహకరించిన చిన్న రైతులు, వ్యాపారులు, మార్కెట్ యార్డ్ సెక్రటరీ, అధికారులు, పాలకవర్గ సభ్యులు ఇతర సభ్యులకు చైర్మన్ సునీత ధన్యవాదాలు తెలిపారు. వచ్చే సంవత్సరంలో మార్కెట్ యార్డ్ కు మరింత లాభం చేకూర్చే విధంగా సిస్ రూపంలో లక్ష్యసాధన చేస్తామని ఆశాభావం వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి కి, ఎంపీ తలారి రంగయ్య కి, ఎమ్మెల్యే జొన్నలగడ్డ పద్మావతి ప్రోత్సాహంతో మరింత అభివృద్ధి చేసి చూపిస్తామని చైర్మన్ సునీత తెలిపారు.

➡️