మిమ్స్ ఉద్యోగులకు మద్దతు ఇవ్వండి

Mar 18,2024 16:40 #Dharna, #Mims employees, #vijayanagaram
  • మిమ్స్ హెల్త్ కేర్ సెంటర్ వద్ద ఉద్యోగులు ధర్నా
  • పలువురు వైద్యులకు వినతి

ప్రజాశక్తి-విజయనగరం టౌన్ : మిమ్స్ ఉద్యోగులు సమస్యలు పరిష్కారం కోసం జరుగుతున్న న్యాయమైన పోరాటానికి మిమ్స్ ఆసుపత్రి వైద్యులు మద్దతు ఇచ్చి సహకరించాలని మిమ్స్ ఎంప్లాయిస్ అండ్ వర్కర్స్ యూనియన్ అధ్యక్ష,కార్యదర్శులు టి వి రమణ, ఎం.నారాయణ రావు లు,సి ఐ టి యు జిల్లా ప్రధాన కార్యదర్శి కె సురేష్ లు కోరారు. సోమవారం సాయంత్రం విజయనగరం లో ఉన్న హెల్త్ కేర్ సెంటర్ వద్ద ధర్నా నిర్వహించి,అనంతరం అక్కడికి వచ్చిన వైద్యులకు వినతిపత్రాలు ఇచ్చి మద్దతు కోరారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మిమ్స్ జే మిమ్స్ లో గత 20 సంవత్సరాలుగా పనిచేస్తూ సంస్థ అభివృద్ధికి మా శక్తి మేరకు కృషి చేసిన ఉద్యోగులు నేడు అనేక రకాల సమస్యలతో సతమత మౌతున్నారు. సమస్యలను పరిష్కరించమని అడిగిన వారిపై క్రమశిక్షణా చర్యలు పేరుతో తొలగించడం, బదిలీ చేయటం గేటు దగ్గర ఆపేయడం చేస్తూ కక్షసాధింపులకు దిగుతున్నారన్నారు. కోవిడ్ కాలంలో ప్రాణాలు ఫణంగా పెట్టి పనిచేసాం. కానీ 2020 అక్టోబర్ నుండి నేటి వరకు మొత్తం 7 డి. ఏలు ఇవ్వలేదన్నారు. 2019 నుండి వేతన ఒప్పందం చేయలేదు. జనవరి నెల జీతం నేటకీ చెల్లించలేదు. చివరికి సెలవులు కూడా ఇవ్వడం లేదన్నారు. సమస్యలుపై అడిగిన ఇద్దరు ఉద్యోగులను పిబ్రవరి 1న గేటు దగ్గర ఆపేసారు, ఇదేమిటీ అన్యాయం అని అడిగితే నచ్చితే పనిచేయండి, లేకపోతే బయటకు పోండి అని ఉద్యోగులను బయటకు నెట్టేసినట్లుగా -యాజమాన్యం వ్యవహరించిందన్నారు. ఫిబ్రవరి 1 నుండి ఉద్యోగులంతా బయటనే ఉండి సమస్యలను పరిష్కరించమని పోరాడుతున్నాం. సమస్యలను పరిష్కరించకపోగా వారానికి ఒక కేసు పెడుతూ ఉద్యోగులను ఇబ్బంది పెడుతున్నది యాజమాన్యం అని అన్నారు. మా కల్లముందే ఎన్.ఎమ్.సి ని మోసగిస్తున్న మిమ్స్ యాజమాన్యం నేడు మమ్మల్ని కూడా మోసగిస్తున్నదన్నారు. మిమ్స్ డాక్టర్గా పనిచేయుచున్న మీరు మా పోరాటానికి అండగాఉండాలని, యాజమాన్యంతో మాట్లాడి మా సమస్యలు పరిష్కారానికి కృషి చేయాలని కోరుతున్నామాన్నారు. కార్యక్రమంలో ఉద్యోగులు పాల్గొన్నారు.

➡️