అచ్చెన్న కుటుంబానికి టిడిపి నాయుకులు పరామర్శ

Apr 7,2024 14:11 #Atchannaidu, #Konaseema, #TDP

ప్రజాశక్తి-రాజోలు: మాతృవియోగంతో బాధపడుతున్న తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షులు కింజరాపు అచ్చెన్నాయుడు కుటుంబ సభ్యులను ఆదివారం రాజోలు నియోజకవర్గ టిడిపి నేతలు పరామర్శించారు. టిడిపి బిసి సెల్ రాష్ట్ర అధికార ప్రతినిధి చెల్లుబోయిన శ్రీనివాస్, టిడిపి వాణిజ్య విభాగం రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి, పిఠాపురం నియోజకవర్గ పరిశీలకులు బోళ్ళ వెంకటరమణ, టిడిపి మీడియా కోఆర్డినేటర్ బోళ్ళ సతీష్ బాబు ఆదివారం నాడు శ్రీకాకుళం జిల్లా నిమ్మాడ వెళ్ళి అచ్చెన్నాయుడు, ఆయన సోదరులు ప్రసాదరావు నాయుడు, ప్రభాకరరావు నాయుడులను పరామర్శించారు. అచ్చెన్న మాతృమూర్తి దివంగత కళావతమ్మ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.

➡️