పోలింగ్ కేంద్రాలను పరిశీలించిన తహశీల్దార్

Feb 8,2024 14:57 #Konaseema, #poling

ప్రజాశక్తి – ఆలమూరు(అంబేద్కర్ కోనసీమ) రానున్న ఎన్నికలలో నేపథ్యంలో మండలంలోని వివిధ గ్రామాల పోలింగ్ కేంద్రాలను తహశీల్దార్ ఏ.గోపాలకృష్ణ సిబ్బందితో కలిసి గురువారం పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మండల పరిధి 18 గ్రామాల్లో మడికి, చెముడులంక, బడుగువానిలంక, మూలస్థానం, చొప్పెల్ల, జొన్నాడలలో కేంద్రాలను పరిశీలించి సమస్యలు గుర్తించామన్నారు. ఇందులో అధిక శాతం సంతృప్తిగానే ఉన్నాయని, కొన్ని కేంద్రాల వద్ద ర్యాంపులు లేవని ఆయన తెలిపారు. అలాగే వికలాంగులు, వృద్ధులకు అసౌకర్యం కలగకుండా ఓటు వినియోగించుకునే విధంగా సిద్ధం చేసేలా చర్యలు తీసుకుంటున్నట్లు ఆయన తెలిపారు. ఈ మేరకు బిఎల్వోలతో సమీక్ష నిర్వహించనున్నట్లు ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో మండల సర్వేయర్ సందీప్ కుమార్, వీఆర్వోలు సూర్యప్రకాష్, జ్యోతి, సిబ్బంది పాల్గొన్నారు.

➡️