రాష్ట్ర ప్రజల సంపూర్ణ ఆరోగ్యమే .. ఆరోగ్య సురక్ష లక్ష్యం : ఎంపీడీఓ రాముడు

Mar 19,2024 17:00 #anatapuram

ప్రజాశక్తి – నార్పల : పేద ప్రజలు వైద్యం కోసం ఇబ్బందులు పడకుండా, ఇంటి వద్దకే వైద్యాన్ని అందించడమే ఆరోగ్య సురక్ష లక్ష్యం అని ఎంపీడీవో రాముడు అన్నారు. మండల  పరిధిలోని కేసేపల్లి సచివాలయల ఆవరణంలో మంగళవారం జరిగిన మలి విడత ఆరోగ్య సురక్ష మెగా వైద్య శిబిరంలో పాల్గొన్న ఎంపీడీఓ రాముడు వైద్యులతో మాట్లాడుతూ..  వైద్యం కోసం వచ్చిన ప్రజలకు వైద్య పరీక్షలు నిర్వహించి, వారికి అవసరమైన మందులు అందజేయాలని వైద్యులకు వైద్య సిబ్బందికి సూచించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఆరోగ్య సురక్ష కార్యక్రమం పేద ప్రజలకు వరం లాంటిది అన్నారు. కార్పొరేటు వైద్యానికి దీటుగా ఆరోగ్య సురక్ష ద్వారా పేదలకు మెరుగైన వైద్యం అందించడమే ప్రధాన లక్ష్యమని అన్నారు. ఈ కార్యక్రమంలో, ఈఓఆర్డీ శైలజరాణి, పప్పురు ప్రాథమిక వైద్యశాల డాక్టర్లు మహేంద్ర, జాహిర సూపర్వైజర్ శ్రీరాములు, ఎం పి హెచ్ ఈ ఓ మల్లికార్జున ఏఎన్ఎంలు, ఆశా కార్యకర్తలు వైద్య సిబ్బంది, గ్రామ పెద్దలు, గ్రామస్థులు తదితరులు పాల్గొన్నారు. మండల పరిధిలోని కూరగనిపల్లి ప్రాథమిక పాఠశాలను మంగళవారం ఎంపీడీవో రాముడు సందర్శించి పాఠశాలలో ఎంతమంది విద్యార్థులు ఉన్నారు? పాఠశాలలో సౌకర్యాల గురించి ఉపాధ్యాయులను అడిగి తెలుసుకున్నారు. అదేవిధంగా మధ్యాహ్న భోజనం మెనూ ప్రకారం అందిస్తున్నారా లేదా అని పరిశీలించారు. పాఠశాల పిల్లలను కూడా మీ పిల్లల మాదిరిగే భావించి మెనూ ప్రకారం పిల్లలకు మధ్యాహ్న భోజనం అందే విధంగా చూడాలని మధ్యాహ్న భోజనం ఏజెన్సీ నిర్వాహకులకు ఉపాధ్యాయులకు ఎంపీడీవో సూచించారు.

➡️