చిలకలూరిపేట సభ భద్రత వైఫల్యాలపై ఎలక్షన్ కమీషన్ దర్యాప్తు చేయాలి

ప్రజాశక్తి-నరసాపురం(పశ్చిమ గోదావరి జిల్లా): చిలకలూరిపేటలో జరిగిన సభ భద్రత వైఫల్యాలపై ఎలక్షన్ కమీషన్ దర్యాప్తు చేయాలని రాష్ట్ర మహిళ కమీషన్ మాజీ సభ్యురాలు,తెలుగు మహిళ జిల్లా అధ్యక్షురాలు డా.శిరిగినీడి రాజ్యలక్ష్మి అన్నారు.మంగళవారం రాయపేట లోని ఆమె నివాసంలో విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ దేశప్రధాన మంత్రి నరేంద్రమోడీ రాష్ట్ర పర్యటనకు వస్తే ఆయనకు రక్షణ కల్పించలేని స్థితిలో రాష్ట్రరక్షణ వ్యవస్థ ఉందన్నారు. ప్రజాగళం కు వచ్చిన స్పందన చూస్తుంటే జగన్ మోహన్ రెడ్డి గద్దె దించడం ఖాయం అని అన్నారు. డబుల్ ఇంజన్ ప్రభుత్వం పవన్ కళ్యాణ్,చంద్రబాబులతో ఏర్పడుతుందన్నారు.ఈ కార్యక్రమంలో జిల్లా మహిళా కమిటీ కార్యదర్శి తాయారు, సోషల్ మీడియా కోఆర్టినేటర్ చల్లా పద్మావతి, బండి స్వర్ణలత, రేకపల్లి లక్ష్మి, సుంకర రాజకుమారి, అల్లాడి మాధవీలత, కంభాల వెంకట లక్ష్మి, చింతా జ్యోతి తదితరులు పాల్గొన్నారు.

➡️