పోలింగ్‌ కేంద్రాల్లో సౌకర్యాలు పక్కాగా ఉండాలి

ప్రజాశక్తి-రాయచోటి/మదనపల్లి జిల్లాలోని పోలింగ్‌ కేంద్రాలలో సౌకర్యాలు పక్కాగా ఉండాలని జిల్లా ఎన్నికల అధికారి అభిషిక్త్‌ కిషోర్‌ సంబంధిత అధికారులకు సూచించారు. శనివారం రాయచోటి పట్టణంలోని నురానిమసీదువీధి, గుర్రంకొండ మండలం జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాల లోని పోలింగ్‌ కేంద్రాలు, మదనపల్లి పట్టణంలోని జిల్లా పరిషత్‌ హై స్కూల్‌, ఈశ్వరమ్మకాలనీలోని పోలింగ్‌ కేంద్రాలను కురబలకోట మండలం, మిట్స్‌ ఇంజినీరింగ్‌ కళాశాలలోని డిస్ట్రిబ్యూషన్‌ కేంద్రాన్ని పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లాలో మొత్తం 1609 పోలింగ్‌ కేంద్రాలు ఉన్నాయని ఎన్నికల కమిషన్‌ మార్గదర్శకాల మేరకు పోలింగ్‌ కేంద్రాలలో కనీస సౌకర్యాలు ర్యాంపు, తాగునీరు, ఫర్నిచర్‌, విద్యుత్‌ సౌకర్యం, ఫ్యాన్‌, లైటింగ్‌ తదితర వసతులు తప్పనిసరిగా ఉండాలన్నారు. ఓటర్లకు ఇబ్బందులు లేకుండా బార్‌ కేడిగ్‌ పటిష్టంగా ఉండాలన్నారు.విభిన్న ప్రతిభావంతులు వంద శాతం ఓటు హక్కును వినియోగించుకునేలా పోలింగ్‌ కేంద్రాల వద్ద ర్యాంపు, వీల్‌ చైర్స్‌తో పాటుగా బిఎల్‌ఒలు, విఆర్‌ఎలు వారికి సహాయకులుగా అందు బాటులో ఉంచాలన్నారు. విభిన్న ప్రతి భావం తులకు వారి సమీపాన ఉన్న పోలింగ్‌ కేంద్రం లొకేషన్‌, బిఎల్‌ఒ లేదా విఆర్‌ఎ ఫోన్‌ నెంబర్‌ వారికి తెలియజేయాలని సూచించారు. ప్రతి పోలింగ్‌ కేంద్రం వద్ద వీల్‌ చైర్‌ ఉండేలా చర్యలు తీసుకో వాలనిఅధికారులను ఆదేశిం చారు. ఓటర్లు, ఏజెంట్లు, అభ్యర్ధులు మొబైల్‌ ఫోన్స్‌, ఐపాడ్‌, ట్యాబులు ఇతర ఎలక్ట్రానిక్‌ వస్తువులు పోలింగ్‌ కేంద్రంలోనికి తీసు కువెళ్ళడానికి అనుమతిలేదని పోలింగ్‌ కేంద్రాల వద్ద 144 సెక్షన్‌ అమలులో ఉంటుందన్న విషయం ప్రతి ఒక్కరు గుర్తించాలన్నారు.పోలింగ్‌ కేంద్రా లలో వీడియో కవరేజ్‌, వెబ్‌ క్యాసిటింగ్‌ ఏర్పాటు చేయడం జరుగుతుందని తెలి పారు. విద్యుత్‌ అంతరాయం కలగకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. వీడియో కవరేజ్‌కు సంబం ధించి ఏయే పోలింగ్‌ కేంద్రంలో వీడియో కవరేజ్‌, వెబ్‌ క్యాసిటింగ్‌ ఏర్పాటు చేసేది వంటి పూర్తి వివరాలను, వీడియో కవరేజ్‌ చేసే వ్యక్తి పేరు ఫోన్‌ నెంబర్ల వివరాలను నియో జకవర్గాల రిటన్నింగ్‌ అధి కారులకు ఇవ్వాలన్నారు. మదనపల్లె జడ్‌పి హైస్కూల్‌ కురబలకోటలోని మిట్స్‌ ఇంజనీరింగ్‌ కళాశాలలోని డిస్ట్రిబ్యూషన్‌ సెంటర్‌లను పరిశీలించి ఏర్పాట్లు పక డ్బందీగా చేపట్టాలన్నారు. పోలింగ్‌ సిబ్బందికి సామగ్రిని అందించడంలో ఎలాంటి లోటుపాట్లు ఎదురుకాకుండా ఏర్పాట్లు చేయాలన్నారు. కార్యక్రమంలో రాయచోటి ఆర్‌డిఒ రంగస్వామి, మదనపల్లి ఆర్‌డిఒ హరిప్రసాద్‌, మదనపల్లి మున్సిపల్‌ కమిషనర్‌ ప్రమీల, ఎన్నికల విభాగం అధికారులు పాల్గొన్నారు.

➡️