కాంగ్రెస్‌తోనే రాష్ట్ర భవిష్యత్తు

May 11,2024 21:10

 ప్రజాశక్తి-విజయనగరం కోట : కాంగ్రెస్‌తోనే రాష్ట్ర భవిష్యత్తు అని విజయనగరం నియోజకవర్గ ఇండియా బ్లాక్‌ మద్దతుతో చేపోటీ చేస్తున్న అభ్యర్థి సుంకరి సతీష్‌ కుమార్‌ అన్నారు. శనివారం ఆయన ఆధ్వర్యంలో బైక్‌ ర్యాలీని ప్రారంభించారు. అంబేద్కర్‌ జంక్షన్‌ వద్ద ప్రారంభమైన ర్యాలీ ఆర్టీసీ కాంప్లెక్స్‌ మీదుగా రైల్వేస్టేషన్‌, స్టేట్‌ బ్యాంక్‌ మెయిన్‌ బ్రాంచ్‌, కన్యకా పరమేశ్వరి కోవెల, గంట స్తంభం, మూడు లాంతర్లు, కోట మీదుగా తిరిగి బాలాజీ జంక్షన్‌కు చేరుకుంది. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ కాంగ్రెస్‌ అధికారంలోకి వస్తే పేదల బతుకులు బాగు పడతాయని తెలిపారు. ప్రత్యేకించి రైతులకు రుణమాఫీ, రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఉచిత విద్య, ఉపాధి కూలీలకు రూ.400 వేతనం వచ్చేలా చర్యలు తీసుకుంటుందని తెలిపారు. వృద్ధులకు, వితంతువులకు నెలకు రూ.4వేలు, వికలాంగులకు రూ.6వేలు పెన్షన్‌ చేస్తామన్నారు. బిజెపి అధికారంలోకి వచ్చిన తరువాత ప్రభుత్వ రంగ సంస్థలను సర్వనాశనం చేసిందన్నారు. విశాఖ స్టీల్‌ప్లాంట్‌ను కార్పొరేట్‌ కంపెనీకి విక్రయించేందుకు పూనుకుందన్నారు. ఈ వినాశకర విధానాలు పోవాలంటే కాంగ్రెస్‌ను గెలిపించాలని కోరారు. కార్యక్రమంలో నెల్లిమర్ల నియోజకవర్గం అభ్యర్థి సరగడ రమేష్‌ కుమార్‌, నాయకులు శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు.ద్వారపూడిలో మజ్జిగ పంపిణీ ప్రజాశక్తి-విజయనగరం టౌన్‌ తన స్నేహితుడు ఆల్తిశేఖర్‌ జయంతి సందర్భంగా మిత్రులంతా ద్వారాపూడి బిసి కాలనీలో పలు సేవా కార్యక్రమాలు చేపట్టారు. శనివారం చలివేంద్రం ఏర్పాటు చేయ్యటం తో పాటు మజ్జిగ పంపిణీ చేశారు. బిసి కాలనీకి చెందిన యువత తమ స్నేహితుడి కోసం చేసిన ఈ సేవా కార్యక్రమాన్ని అందరూ అభినందించారు.

➡️