వ్యాధులు ప్రబలకుండా జాగ్రత్తలు తీసుకోవాలి

Jun 28,2024 20:44

ప్రజాశక్తి-నెల్లిమర్ల : వ్యాధులు ప్రబలకుండా తగు జాగ్రత్తలు తీసుకోవాలని ఎంపిపి అంబళ్ల సుధారాణి సూచించారు. శుక్రవారం స్థానిక ఎంపిడిఒ కార్యాలయంలో ఎంపిడిఒ జి.రామారావు ఆధ్వర్యంలో పంచాయతీ కార్యదర్శులు, వైద్య సిబ్బందితో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎంపిపి మాట్లాడుతూ గ్రామాల్లో పారిశుధ్య పనులు నిర్వహించి మురుగునీటి నిల్వ కాకుండా చూడాలన్నారు. తాగునీటి పథకాలు ఎప్పటికప్పుడు క్లోరినేషన్‌ చేయాలన్నారు. వైద్య సిబ్బంది ఇంటింటికి వెళ్లి జ్వరాల బారిన పడిన వారిని గుర్తించి తగు వైద్య సేవలు అందించాలని సూచించారు. పారిశుధ్య నిర్వహణ, తాగునీరు సరఫరాలో నిర్లక్ష్యం వహిస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు. సమావేశంలో ఎఎంసి మాజీ చైర్మన్‌ అంబళ్ల శ్రీరాములు నాయుడు, ఇఒపిఆర్‌డి కె.సింహాద్రి, తదితరులు పాల్గొన్నారు.

➡️