రైతు సాధికారతే ప్రభుత్వ లక్ష్యం : ఎమ్మెల్యే

Jun 28,2024 20:45

 ప్రజాశక్తి-నెల్లిమర్ల : రైతు సాధికారతే లక్ష్యంగా ప్రభుత్వం పనిచేస్తుందని ఎమ్మెల్యే లోకం నాగ మాధవి అన్నారు. శుక్రవారం వల్లూరు గ్రామంలో వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో రాయితీపై వరి విత్తనాలను ఎమ్మెల్యే పంపిణీ చేశారు. ఈ సందర్భంగా జరిగిన సభలో ఎమ్మెల్యే మాట్లాడుతూ గత ప్రభుత్వ హయాంలో వ్యవసాయ రంగం నిర్లక్ష్యానికి గురై రైతులు ఇబ్బందులు పడ్డారని తెలిపారు. ప్రస్తుత కూటమి ప్రభుత్వం రైతులను అన్నివిధాలా ఆదుకొని అండగా నిలుస్తుందని భరోసా ఇచ్చారు. రైతులు సేంద్రియ వ్యవసాయంపై దృష్టిసారించి ఆదాయాన్ని పెంచుకోవాలని కోరారు. ప్రభుత్వం అందిస్తున్న రాయితీలు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. అనంతరం ఎమ్మెల్యేను గ్రామస్తులు ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో ఎంపిపి అంబళ్ళ సుధారాణి, టిడిపి నియోజకవర్గ ఇన్‌ఛార్జి కర్రోతు బంగార్రాజు, రాష్ట్ర పరిశీలకులు సువ్వాడ రవి శేఖర్‌, మాజీ ఎంపిపి సువ్వాడ వనజాక్షి, టిడిపి మండల అధ్యక్షులు కడగల ఆనంద్‌ కుమార్‌, జిల్లా అధికార ప్రతినిధి గేదెల రాజారావు, బిజెపి నాయకులు బూర్లే శ్రీధర్‌, సర్పంచ్‌ పంచాది జయలక్ష్మి, ఎంపిటిసి లెంక నాగేశ్వరి, నాయకులు పంచాది జగన్నాథం, లెంక సన్యాసి రావు, తహశీల్దారు డి.ధర్మరాజు, ఎంపిడిఒ జి.రామారావు, ఎఒ ఎం.పూర్ణిమ తదితరులు పాల్గొన్నారు.

➡️