ప్రమాదానికి గురైన మీడియా వాహనం

Mar 27,2024 17:29 #Tirupati

తృటిలో తప్పిన పెను ప్రమాదం

ప్రజాశక్తి – వి కోట : కుప్పం నుంచి పలమనేర్ కు వెళ్తున్న మీడియా వాహనం వీకోటలో రోడ్డు ప్రమాదానికి గురైంది. కుప్పంలో చంద్రబాబు పర్యటన ముగించుకుని పలమనేరు బహిరంగ సభకు బుధవారం వెళుతున్న మీడియా వాహనం ఈ ప్రమాదానికి గురైంది. వీకోట పట్టణ సమీపంలోని ముదిమడుగు గ్రామం నుంచి ట్రాక్టర్ కుప్పం ప్రధాన రహదారులకి ఉన్నపళంగా రావడంతో కుప్పం వైపు నుంచి వస్తున్న టెంపో ట్రావెలర్ అదుపు చేయలేక రెండు వాహనాలు ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో టెంపో ట్రావెలర్ డ్రైవర్ తిరుపతికి చెందిన సంజీవ్ కుమార్ తీవ్రంగా గాయపడ్డాడు. హెచ్ఎంటివి కెమెరామెన్ సైతం గాయాలయ్యాయి. అదృష్టవశాత్తు వాహనంలో ప్రయాణిస్తున్న మిగిలిన మీడియా మిత్రులందరూ స్వల్ప గాయాలతో బయటపడ్డారు. టిటి డి కొన్న తీవ్రతకు ట్రాక్టర్ ట్రాలీ బోల్తా పడింది. వీకోట పట్టణంలో ట్రాఫిక్ స్తంభించడంతో సమాచారం అందుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని వాహనాలను పక్కకు తీసి ట్రాఫిక్ ను పునరుద్ధరించారు. ఈమెరకు వీకోట ఎస్సై బాబు కేసు దర్యాప్తు చేస్తున్నారు. తిరుపతి నుండి వచ్చిన మీడియా ప్రతినిధుల ను ఇతర వాహనాల్లో పలమనేరు మీటింగుకు తరలించారు.

➡️