సమస్యల్ని పరిష్కరించాలంటూ .. తపాలాశాఖ సిబ్బంది నిరసన

Dec 12,2023 13:06 #postal staff, #problems, #Protest

పెదబయలు (అల్లూరి) : తపాలా శాఖ ఉద్యోగుల సమస్యలను పరిష్కరించాలని డిమాండ్‌ చేస్తూ … తపాలా శాఖ కేంద్ర కమిటీ యూనియన్‌ పిలుపు మేరకు తపాలా సిబ్బంది పెదబయలులోని స్థానిక సబ్‌ పోస్ట్‌ కార్యాలయంలో మంగళవారం నిరసన చేపట్టారు.

పెదబయలు ముంచింగి పుట్టు మండలాలకు సంబంధించిన 34 బ్రాంచి కార్యాలయపు సిబ్బంది సబ్‌ పోస్ట్‌ ఆఫీసు ముందు తమ డిమాండ్ల సాధనకై ఈరోజు ఉదయం 9 గంటల నుండి మధ్యాహ్నం 3 గంటలవరకు కేంద్ర ప్రభుత్వ తీరుకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. రోజుకు (జిడిఎస్‌లకు) 8 గంటలను పని దినంగా పరిగణించాలన్న సుప్రీం కోర్టు ఆదేశాల మేరకు… సమానపనికి సమాన వేతనం చెల్లించాలని, సీనియారిటీ ఇంక్రిమెంట్‌ రూ.12,24,36 కల్పించాలని, గ్రాడ్యుటీ రూ.1,50,000 నుండి రూ.5లక్షలకు పెంచాలని కోరారు. సిబ్బంది కుటుంబసభ్యులకు వైద్య సదుపాయం సౌకర్యం కల్పించాలని డిమాండ్‌ చేశారు. దశలవారీగా చేసే తపాలా శాఖ గల్లీ నుండి ఢిల్లీ వరకు వినిపించి డిమాండ్ల సాధనకు ప్రతి తపాలా ఉద్యోగి సమ్మెలో పాల్గొని విజయం సాధించేవరకు పోరాడాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో యూనియన్‌ నాయకులు కేశవ ప్రసాద్‌, సురేష్‌, మహిళా సిబ్బంది పాల్గొన్నారు.

➡️