‘మతతత్వ బిజెపిని తరిమికొట్టాలి’

ప్రజాశక్తి-రాజంపేట అర్బన్‌ మతతత్వ బిజెపి పార్టీని తరిమికొట్టి ఇండియా వేదికను గెలిపించాలని సిపిఐ రాజంపేట అసెంబ్లీ అభ్యర్థి బుకే విశ్వనాథ నాయక్‌ కోరారు. ఇండియా కూటమి రాజంపేట అసెంబ్లీ అభ్యర్థిగా విశ్వనాథ నాయక్‌ను ప్రకటించిన నేపథ్యంలో రాజంపేట ఎఐటియుసి కార్యాల యంలో శనివారం వామపక్ష నాయకులతో కలిసి ఏర్పాటు చేసిన విలేక రుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ బిజెపి ప్రభుత్వం దేశంలో కుల, మత, వర్గ, ప్రాంతీయ భేదాలు చూపుతూ ఆంగ్లేయుల బాటలో కుల, మత, వర్గాలుగా విభజించి పాలిస్తోందని ఆరోపించారు. కార్పొరేటర్లను పెంచి పోషిస్తూ పేద, మధ్యతరగతి వర్గాలను, వారి సంక్షేమాన్ని గాలికి వదిలే సిందన్నారు. లౌకిక ప్రజాస్వామ్య పీడితులు నుంచి దేశాన్ని రక్షించు కోవాలంటే ఎన్డీఏ కూటమి అధికారంలోకి రావాలని అన్నారు. ముఖ్యంగా నియోజకవర్గం పెత్తందార్ల చేతిలో నలిగిపోయిందని, నాయకుల అధికార దాహానికి అన్నమయ్య ప్రాజెక్టు తెగిపోయి 43 మంది జల సమాధి అయ్యారని విమర్శించారు. వరద బాధితులకు నేటికీ సంపూర్ణ సహాయ సహకారాలు అందించిన పాపాన పోలేదని ఆవేదన చెందారు. వైద్య కళాశాల మదనపల్లికి తరలిపోవడం వెనుక రాజంపేట పట్ల పాలకుల నిర్లక్ష్య వైఖరి అద్దం పడుతోందని అన్నారు. పేద కుటుంబం నుంచి వచ్చిన తాను ప్రజల కష్టసుఖాలను అవలోకనం చేసుకోగలనని తెలిపారు. తనను గెలిపిస్తే నియోజకవర్గ ప్రజల గలాన్ని చట్టసభలలో వినిపిస్తానని, నియోజ కవర్గాన్ని అభివద్ధి పథంలో నడుపుతానని తెలియజేశారు. కార్యక్రమంలో సిపిఐ జిల్లా కార్యదర్శి నరసింహులు, జిల్లా సహాయ కార్యదర్శి పి.మహేష్‌, సిపిఎం జిల్లా కమిటీ సభ్యులు చిట్వేలి రవికుమార్‌, రాజంపేట సిపిఐ ఏరియా కార్యదర్శి కార్యదర్శిఎమ్మెస్‌ రాయుడు, సహాయ కార్యదర్శి శివరామకృష్ణదేవరా, ఎస్‌ఎఫ్‌ఐ జిల్లా కార్యదర్శి నరసింహ సర్వేపల్లి, సిపిఐ పట్టణ కార్యదర్శి ఇ.సికిందర్‌, సిపిఐ రైల్వేకోడూరు ఏరియా కార్యదర్శి సి.చిన్నయ్య, సిపిఐ నాయకులు నాగేశ్వరావు పాల్గొన్నారు.

➡️