కాంగ్రెస్‌ గెలుపుతోనే హోదా సాధ్యం

Apr 29,2024 21:24

 ప్రజాశక్తి – నెల్లిమర్ల : రాష్ట్రంలో కాంగ్రెస్‌ పార్టీ గెలుపుతోనే రాష్ట్రానికి ప్రత్యేక హోదా సాధ్యమవుతుందని ఇండియా వేదిక కాంగ్రెస్‌ అభ్యర్థి సరగడ రమేష్‌ కుమార్‌ అన్నారు. సోమవారం థామస్‌పేట, కొండవెలగాడ, చంద్రంపేట గ్రామాల్లో సిపిఎం, సిపిఐ నాయకు లతో కలసి రమేష్‌ కుమార్‌ ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సార్వత్రిక ఎన్నికల్లో హస్తం గుర్తుపై ఓటు వేసి ఇండియా వేదికగా కాంగ్రెస్‌ పార్టీని గెలిపించాలని కోరారు. గత పదేళ్లుగా బిజెపి, వైసిపి, టిడిపి రాష్ట్ర ప్రజలను ప్రత్యేకహోదా విషయంలో మభ్య పెట్టి మోసం చేశాయన్నారు. రాష్త్రం బాగు పడాలంటే సార్వత్రిక ఎన్నికల్లో ఇండియా వేదికగా కాంగ్రెస్‌ పార్టీని గెలిపించాలని కోరారు. ఈ ప్రచారంలో కాంగ్రెస్‌, సిపిఎం సిపిఐ నాయకులు పాల్గొన్నారు.కాంగ్రెస్‌ అధికారంలోకి వస్తే రాష్ట్రానికి ప్రత్యేక హోదా శృంగవరపుకోట: కాంగ్రెస్‌ అధికారంలోకి వస్తే రాష్ట్రానికి 10 సంవత్సరాలు ప్రత్యేక హోదా కల్పిస్తామని ఇండియా వేదిక కాంగ్రెస్‌ పార్టీ అభ్యర్థి గేదెల తిరుపతి అన్నారు. మండలంలోని ధర్మవరం, లక్కవరపుకోట మండలంలోని ఆయన సోమవారం ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కేంద్రంలో బిజెపి నరేంద్రమోడీ ప్రభుత్వం భారత రాజ్యాంగాన్నే మార్చాలని యోచనలో ఉందన్నారు. అదానీ అంబానీలకు ఊడిగం చేస్తూ దేశంలో గల పరిశ్రమలన్ని దారాదత్వం చేస్తున్నారని ఆరోపించారు. రాష్ట్రంలో చంద్రబాబు, జగన్‌ మోహన్‌ రెడ్డి ఎవరు గెలిచినా నరేంద్రమోడీకే మద్దతు ఇస్తారన్నారు. కాంగ్రెస్‌ ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేస్తున్న తనను గెలిపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్‌ పార్టీ సీనియర్‌ నాయకులు మణిబాబు, నానాజీ, భద్రరావు తదితరులు పాల్గొన్నారు.

➡️