జిల్లాను ఠారెత్తించిన ఎండలు

Apr 15,2024 21:29

ప్రజాశక్తి-పార్వతీపురంరూరల్‌ : వారంరోజులుగా తన ప్రతాపం చూపిస్తున్న భానుడు సోమ వారం జిల్లాలోని అన్ని మండలాల్లోనూ నిప్పులు కురిపించాడు. అందుకు నిదర్శనం సోమవారం నమోదైన ఉష్ణోగ్ర తలను చూస్తే అర్ధమౌతుందు. వివరా లిలా ఉన్నాయి. అత్యధికంగా సాలూరు 43.1 డిగ్రీలు నమోదు కాగా, కురుపాం 41,6, గుమ్మలక్ష్మీపురం 41.6, సీతాన గరం 40.2, పార్వతీపురం 40, భామిని 4 1.6, పాలకొండ 41.6, జియ్యమ్మ వలస 41.6, పాచిపెంట 40.2, మక్కువ 40.9, సీతంపేట 40, బలిజిపేట 40.9, కొమరాడ 38.7, వీరఘట్టం 41.6, గరుగుబిల్లి39.9 డిగ్రీలు ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఉదయం 7గంటల నుండి వాతావరణం వేడెక్కడంతో ఉపాధి హామీ కూలీలు పనులు సక్రమంగా నిర్వ హించలేకపోతున్నారు. రానున్న రోజుల్లో కూడా అధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ, విపత్తుల నివారణ శాఖకు చెందిన అధికా రులు హెచ్చరిస్తున్నందు వల్ల ప్రజలు గమనించి తగు జాగ్రత్తలు తీసుకోవాలని, అధిక ఉష్ణోగ్రతల వల్ల డీహైడ్రేషన్‌ పెరిగే అవకాశం ఉన్నందున ప్రతి ఒక్కరూ ఉదయం 10గంటల తర్వాత బయటకు రాకూడదని, వచ్చినా నూలు దుస్తులు ధరించడం, శీతలపానీయాలు సేవించ డంతో పాటు తప్పనిసరిగి తలకు టోపీలు ధరించాలని జిల్లా కేంద్రాసుపత్రి సూపరి టెండెంట్‌ డాక్టర్‌ వాగ్దేవి సూచిస్తున్నారు.

➡️