ప్రొటోకాల్‌పై మాట్లాడే అర్హత టిడిపి ఎమ్మెల్యేకు లేదు

Feb 17,2024 14:43 #Konaseema, #press meet, #YCP Leaders

ప్రజాశక్తి-మండపేట(అంబేద్కర్‌ కోనసీమ) : ప్రోటోకాల్‌ పై మాట్లాడే అర్హత టిడిపి ఎమ్మెల్యే వేగుళ్ళ జోగేశ్వరరావుకు లేదని వైసిపి రాష్ట్ర నాయకులు, మున్సిపల్‌ కోఆప్షన్‌ సభ్యులు రెడ్డి రాజబాబు పేర్కొన్నారు. శనివారం స్థానిక వైసిపి కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో రాజబాబు మాట్లాడుతూ.. గత ప్రభుత్వ హయాంలో అనేక సందర్భాలలో నెగ్గిన వారిని పక్కన పెట్టి ఓడిపోయిన వారికి పెత్తనమిచ్చిన సంఘటనలు కోకొల్లలు ఉన్నాయన్నారు. గత కౌన్సిల్‌ సమావేశాల్లో అప్పటి కౌన్సిలర్‌ వరలక్ష్మి తన వార్డు సమస్యలపై అడిగితే చైర్మన్‌ సమాధానం చెప్పాల్సి వుండగా ఎమ్మెల్యే తమవారి వార్డు పనులు అన్నీ పనులు పూర్తి చేసాకే మీ వార్డు పనులు చేస్తామన్న చెప్పిన సంగతిని గుర్తుచేశారు. అంతే కాకుండా రేపు టిడ్కో ఇళ్లు పంపిణీ చేస్తామనగా ముందు రోజు ధర్నా చేయడం సబబేనా అని ప్రశ్నించారు. టిడ్కో ఇళ్ల దగ్గర ప్రొటోకాల్‌ విషయంలో రాష్ట్ర ప్రభుత్వం నుంచి వచ్చిన నిధులకే ఎమ్మెల్యే అధ్యక్షత వుంటుందని మున్సిపల్‌ నిధులతో చేసిన పనులకు చైర్పర్సన్‌ అధ్యక్షతన జరుగుతుందన్నారు. ఈ విషయంలో ప్రొటోకాల్‌ ఉల్లంఘన జరగలేదన్నారు. అనంతరం తోట, పాపారాయుడులు మాట్లాడుతూ రెడ్డి కులస్థులను నియోజకవర్గంలో అణగదొక్కడమే ఎమ్మెల్యే వ్యూహం అన్నారు. గత ప్రభుత్వ హయాంలో ఎన్ని కోట్ల రూపాయలతో విద్యుత్‌ పనులు చేపట్టారో ఎమ్మెల్యే చెప్పాలన్నారు. ఈ విలేకరుల సమావేశంలో ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులు, వైసిపి నాయకులు కర్రి పాపారాయుడు, ఏడిద సర్పంచ్‌ బూరిగ ఆశీర్వాదం, కౌన్సిల్‌ విప్‌ పోతంశెట్టి ప్రసాద్‌, ఎంపిపి ఉండమట్ల వాసు వైసీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

➡️