పైపు లైన్లు ఉన్నాయి.. కానీ నీరే రావడం లేదు..!

Mar 22,2024 09:36 #pipe lines, #prakasam, #Water Problem

పొదిలి (ప్రకాశం) : పొదిలి మండలంలో పలు గ్రామాల ప్రజలు సాగర్‌ మంచినీరు రాక అవస్థలు పడుతుండగా పట్టణంలో 15 రోజులకు ఒకసారి నీరు ఇస్తున్నారు. పట్టణంలోని శివారు ప్రాంతాల ప్రజలు తీవ్ర అవస్థలు పడుతున్నారు. శుక్రవారం ఉదయం అక్కడి ప్రజలు ప్రజాశక్తితో తమ గోడు వెళ్లబోసుకున్నారు. పట్నంలోని టైలర్స్‌ కాలనీ, నిర్మలా కాన్వెంట్‌ రోడ్డు, మండలంలోని ఆముదాలపల్లి, నిమ్మవరం ఇతర గ్రామాల్లో మంచినీటి సరఫరా పైప్‌ లైన్లు ఉన్నా నీరు రావడం లేదని గ్రామస్తులు తెలిపారు. సాగర్‌ నీరు రాకపోగా భూగర్భ జలాలు అడుగంటి ఇంటి అవసరాలకు ఉపయోగించే కనీస నీరు కూడా అందడం లేదని ప్రజల ఆందోళన చెందుతున్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి తమ సమస్యను పరిష్కరించాలని కోరారు.

➡️