జిల్లాలో అభివృద్ధి శూన్యం

ప్రజాశక్తి-ముద్దనూరు/జమ్మలమడుగు రూరల్‌/పులివెందుల రూరల్‌/ప్రొద్దుటూరుఉక్కు పరిశ్రమ పేరుతో ఒక్క జమ్మలమడుగు ప్రజలనే మోసం చేయటం కాకుండా, కడప జిల్లాలో ఏ ఒక్క ప్రాంతం కూడా అభివృద్ధి చేసిన పాపాన పోలేదని పిసిసి అధ్యక్షులు వైఎస్‌.షర్మిల అన్నారు. శనివారం జమ్మలమడుగు, ప్రొద్దుటూరు నియోజవకర్గాల్లో ఆరో రోజు ఆమె బస్సుయాత్ర నిర్వహించారు. ఇండియా వేదిక నాయకులతో కలిసి జమ్మలమడుగు సమీపంలోని కన్యతీర్థం వద్ద ఉక్కు పరిశ్రమ శంకుస్థాపన చేసిన స్థలాన్ని ఆమె పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయా ప్రాంతాల్లో నిర్వహించిన సభల్లో షర్మిల మాట్లాడుతూ పులివెందుల అభివృద్ధి కోసం ఏర్పాటు చేసిన పాడా సంస్థ అవినీతికి నిలయంగా మారి పోయిందని తెలిపారు. కడప ఇండిస్టియల్‌ ఏరియా చిన్న, మధ్యతరహా పరిశ్రమలన్నీ ప్రభుత్వ విధానాల వల్ల మూతపడుతున్న పట్టించుకోవడం లేదన్నారు. రాజోలి శంకుస్థాపనకే పరిమితమైందని నిధుల కేటాయింపు చేయకుండా దాటవేస్తూ వస్తు న్నారన్నారు. సర్వరాయ సాగర్‌ కింది చెరు వులకు, పంట పొలాలకు, ప్రధాన కాలవలు, పంట కాలవలు, పిల్ల కాలువలు నిర్మాణం పట్టి ంచుకోలేదన్నారు. జగన్‌ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ప్రత్యేక హోదా కోసం, ప్రత్యేక ప్యాకేజీ కోసం, పోలవరం, రాజధాని కోసం పట్టు పట్టి ప్రశ్నించిన వ్యక్తి నేడు అధికారం వచ్చాక ఆ పట్టు దల ఎక్కడ పోయిందని నిలదీశారు. బిజెపితో స్నేహం కోసం పోలవరం ప్రాజెక్టును, స్పెషల్‌ స్టేటస్‌ను, రాజధానిని తాకట్టు పెట్టిన ఘనత జగన్మోహన్‌రెడ్డి దన్నారు. రైతు బాగుంటే రాష్ట్రం బాగుం టుందని భావించి నాడు రైతుల కోసం ధరల స్థిరీకరణ ఏర్పాటు చేస్తానని చెప్పి అమలు చేయలేకపోయారన్నారు. రైతుకు మద్దతు ధర ఎక్కడ అని ప్రశ్నించారు. రెండు లక్షల 30 వేల ఉద్యోగాలు ఎక్కడ ఇచ్చారని ప్రశ్నించి, ఎన్నికల ముందు మద్యపానాన్ని పూర్తిగా నిషేదిస్తామని చెప్పి నేడు మద్యపానం పేరుతో ఒక మాఫియా నడుపుతున్నారని, జగనన్న వాగ్దానాలన్ని లిక్కర్‌ షాప్‌లోనే ఉన్నాయని విమర్శించారు. హత్యా రాజకీయాలకు స్వస్తి పలకాలని పేర్కొన్నారు. వివేకానందరెడ్డిని క్రూరంగా హత్య చేసింది ఎంపీ అవినాష్‌రెడ్డి అని సిబిఐ ఆధారాలు చూపుతున్నా జగన్‌ నిందితున్ని కాపాడు తున్నారన్నారు. ముఖ్యమంత్రి హత్యా రాజకీ యాలను ప్రోత్సాహిస్తూ అధికారాన్ని అడు ్డపెట్టుకుని హంతకులను కాపాడుతున్నారని ఆరోపించారు. నాలుగైదు రోజులుగా చేస్తున్న ప్రచారానికి ప్రజల ఆదరణ చూసి జగన్‌ భయపడి ఎంపీని మార్చేందుకు అడుగులు వేస్తున్నాడన్నారు. జమ్మలమడుగు ఎమ్మెల్యే ఇసుక, గ్రావెల్‌ దోపిడీ చేసిరూ.వేల కోట్లు సం పాదించాడన్నారు. అన్యాయాన్ని సహించేది లేదని ఎవరికి భయపడనన్నారు. విమలమ్మ మాకు మేనత్తన్నారు. మేము ఆధారాలు లేకుండా మాట్లాడటం లేదని తెలిపారు. వివేకా హత్య విషయంలో మేము ఆరోపణలు చేయడం కాదు, సిబిఐ చూపించిన ఆధారాలు మాత్రమే మేము ఎత్తి చూపిస్తున్నామని పేర్కొ న్నారు. ఆధారాలు ఉండబట్టే మాకు తెలిసిం దన్నారు. విమలమ్మ కొడుకుకి జగన్‌ పనులు ఇచ్చారని చెప్పారు. ఆర్థికంగా బల పడ్డారని, అందుకే జగన్‌ వైపు ఆమె మాట్లాడుతున్నారని పేర్కొన్నారు. ఇక్కడ చనిపోయింది సొంత అన్న అని విమలమ్మ తెలుసుకోవాలన్నారు. విమలమ్మకి వయసు మీద పడిందని, అందులో ఎండా కాలం కావడంతో ఇలాంటి మాటలు మాట్లాడుతోందన్నారు. సిపిఎం జిల్లా కార్యదర్శి చంద్రశేఖర్‌ మాట్లాడుతూ కడప జిల్లా ప్రజలను ఉక్కు పరిశ్రమ పేరుతో మోసం చేసిన ముఖ్యమంత్రి జగన్‌ మోహన్‌రెడ్డికి ఎందుకు ఓటేయాలన్నారు. బిజెపి భారత లౌకిక రాజ్యాంగాన్ని మతతత్వ రాజ్యాంగంగా మార్చే ప్రమాదం ఉందన్నారు.18వ సార్వత్రిక ఎన్నికల్లో ఇండియా వేదిక అభ్యర్థులను గెలిపించాలని, వామపక్ష పార్టీలు బలపరిచిన కాంగ్రెస్‌ పార్టీ అభ్యర్థి వై.ఎస్‌.షర్మిలను గెలిపించాలని జిల్లా ప్రజలను కోరారు. కార్యక్రమంలో వివేకా కుమార్తె సునీత, పిసిసి మీడియా చైర్మన్‌ ఎన్‌.తులసిరెడ్డి, సిపిఐ రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు ఈశ్వరయ్య, సిపిఎం జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు బి.మనోహర్‌, జిల్లా కమిటీ సభ్యులు సత్యనారాయణ, డివైఎఫ్‌ఐ జిల్లా కార్యదర్శి వి.శివకుమార్‌, సిపిఎం జమ్మలమడుగు పట్టణ కార్యదర్శి ఏసుదాసు, నాయకులు దాసరి విజరు, వినరు, డివైఎఫ్‌ఐ జిల్లా కార్యదర్శి వీరనాల శివకుమార్‌, కాంగ్రెస్‌ నాయకులు పాల్గొన్నారు.వివేకాకు సునీత, షర్మిల నివాళులుపులివెందుల పట్టణంలోని వైఎస్‌ఆర్‌ ఘాట్‌లో ఉన్న వై.ఎన్‌.వివేకానందరెడ్డి సమాధి వద్ద శనివారం సునీత, షర్మిల, రాజశేఖర్‌రెడ్డి, శివప్రకాష్‌రెడ్డితో పాటు పలువురు కుటుంబ సభ్యులు నివాళులర్పించారు. అనంతరం ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. కార్యక్రమంలో పులివెందుల కాంగ్రెస్‌ ఇన్‌ఛార్జి వేలూరు శ్రీనివాసరెడ్డి పాల్గొన్నారు.

➡️