ఆటో, క్యాబ్‌ లపై ఈ చలనాలు రద్దు చేయాలి

Feb 24,2024 14:27 #CITU, #vijayanagaram
  • ఆలిండియా రోడ్‌ ట్రాన్స్పోర్ట్‌ వర్కర్స్‌ ఫెడరేషన్‌
  • ఫిబ్రవరి 26న కలెక్టరేట్‌ వద్ద ధర్నాను విజయవంతం చేయలని పిలుపు

ప్రజాశక్తి-విజయనగరం టౌన్‌ : స్టాఫ్‌ లైన్‌ వైలేషన్‌ పేరుతో ఆటో, క్యాబ్‌పై విధించిన ఈ చలానాలు రద్దు చేయాలని కోరుతూ ఫిబ్రవరి 26న సోమవారం ఉదయం 11 గంటలకు కలెక్టరేట్‌ వద్ద జరిగే ధర్నాలో డ్రైవర్లంతా పాల్గొని విజయవంతం చేయాలని ఆలిండియా రోడ్‌ ట్రాన్స్పోర్ట్‌ వర్కర్స్‌ ఫెడరేషన్‌ (సీఐటీయూ) జిల్లా కన్వీనర్‌ ఏ.జగన్మోహన్రావు పిలుపునిచ్చారు. శనివారం ఉదయం కరపత్ర ప్రచారంలో భాగంగా అంబేద్కర్‌ జంక్షన్‌ వద్ద ఉన్న ఆటో స్టాండ్‌ కార్మికులతో ఆయన మాట్లాడుతూ.. వేకువ జామున 4 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు స్టాండ్‌లో ఉన్న సరైన బేరాలు లేక ఆటో, క్యాబ్‌ డ్రైవర్‌ లో ఇబ్బంది పడుతుంటే వారిపై స్టాప్‌ లైన్‌ వైలేషన్‌ పేరుతో ఈ చలానాలు వేయటం దుర్మార్గమన్నారు. ఈ విధంగా చలనాలు వేస్తున్నట్లు కనీసం డ్రైవర్లకు తెలియడం లేదని, బ్రేక్‌ కోసం ఆర్టీవో కార్యాలయానికి వెళితే వేలకు వేలు పెనాల్టీ కట్టమంటున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. ట్రాఫిక్‌ నియంత్రణ, ప్రమాదాల నివారణ కోసమే పెనాల్టీలు వేసినట్లయితే ఇలా వసూలైన డబ్బులతో రాష్ట్ర ప్రభుత్వం తమ ఖజానా నింపుకోకుండా వాటి తో డ్రైవర్లకు సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయాలని డిమాండ్‌ చేశారు. కానీ ప్రభుత్వం ఉద్దేశ పూర్వకంగానే జీవో నెంబర్‌ 21ని జారీ చేసి ఫీజులు,పెనాల్టీలు పెంచి డ్రైవర్ల పై ఆర్థిక దాడికి పాల్పడుతుందన్నారు. అనంతరం ధర్నా కరపత్రాన్ని ఆవిష్కరించారు. కార్యక్రమంలో జె .రామారావు జి.భాస్కరరావు, వై.భాస్కరరావు, బి.ప్రసన్న, వై.ఈశ్వరరావు, పి.ఆనంద్‌, వై.మోహ, పి.శేఖర్‌, బి.శ్రీను తదితరులు పాల్గొన్నారు.

➡️