అంతర్‌ రాష్ట్ర మద్యం బాటిల్స్‌ సీజ్‌ ఒకరు అరెస్ట్‌

అంతర్‌ రాష్ట్ర మద్యం బాటిల్స్‌ సీజ్‌ ఒకరు అరెస్ట్‌

అంతర్‌ రాష్ట్ర మద్యం బాటిల్స్‌ సీజ్‌ ఒకరు అరెస్ట్‌ప్రజాశక్తి – తడ: ఎన్నిక లను దృష్టిలో వుంచుకుని బివిపాళెం చెక్‌పోస్టువద్ద పోలీసులు తనిఖీ చేస్తుం డగా అనుమానా స్పదం గా తిరుగుతున్న ఓ వ్యక్తి వద్ద వున్న అంతర్‌ రాష్ట్ర మద్యం బాటిళ్లను తనిఖీ చేశారు. నాయుడుపేట డిఎస్‌పి యం రాజగోపాల్‌ రెడ్డి తడ పోలీస్‌ స్టేషన్‌లో మీడియాకు వివరాలు వెల్లడించారు. ఎస్‌పి ఆదేశం మేరకు డియస్‌పి పర్యవేక్షణలో ట్రైనింగ్‌ డియస్‌పి పి.సింధు ప్రియ, సూళ్లూరు పేట సిఐ యం మధుబాబు, తడ పోలీస్‌ స్టేషన్‌ యస్‌ఐ జేపి శ్రీనివాస రెడ్డి తమ సిబ్బందితో కలసి 15 రోజులుగా బీవీ పాళెం చెక్‌ పోస్టు వద్ద చెన్నై నుండి నెల్లూరు వైపు వెళ్లే వాహనాలను తనిఖీ చేస్తున్నారు. ఈ సమ యంలో కొంత దూరంలో ఓ వ్యక్తి అనుమానాస్పదంగా కనిపించడంతో తడ యస్‌ఐ జేపి శ్రీనివాస రెడ్డి వారి సిబ్బంది అతని వద్ద వున్న అట్ట బాక్స్‌లను తనిఖీ చేయగా ఇతర రాష్ట్రాలకు చెందిన బిల్లు లేకుండా 124 మద్యం బాటిళ్లు వుండడం చూసి అతడిని విచారించారు. అతను బాపట్ల జిల్లా, చెరుకుపల్లి మండలం, రాంబోట్ల వారి పాలెంకు చెందిన జూపూడి బేబెశ్వర రావు అని తెలిపారు. చెన్నై నుండి హైదరాబాద్‌ కు వెళుతున్న కావేరీ ట్రావెలర్స్‌ బస్సులో చెన్నై లోని మాదవరం వద్ద బస్సు ఎక్కగా బీవీ పాళెం వద్ద బుధవారం తెల్లవారు జామున 1 గంటకు తనిఖీ చేస్తుండగా బస్సు కొంత దూరంలో ఆగడంతో బస్సు నుండి తన లగేజ్‌ కాటన్‌ బాక్సులతో దిగినట్లు తెలిపారు. అతని వద్ద నుండి ఇతర రాష్ట్రాలకు చెందిన 114 ఫుల్‌ బాటిల్స్‌, 10 క్వార్టర్‌ బాటిల్స్‌ మొత్తం 124 మద్యం బాటిల్స్‌ను స్వాధీనం చేసుకున్నారు. అతనిపై కేసు నమోదు చేసి రిమాండ్‌కి పంపామని వారు తెలిపారు. ఈ మద్యం బాటిల్స్‌ను వ్యాపార నిమిత్తం తీసుకెళ్లి అధిక ఆదాయం పొందుతున్నట్లు తెలిసింది. ఈ తనిఖీ లలో ఎఎస్‌ఐ శ్రీకుమార్‌ రెడ్డి, పీసీలు వై విజరు కుమార్‌, వై నాగార్జున, హోంగార్డులు పి రామయ్య, కె శ్రీనివాసులు పాల్గొన్నారు.

➡️