ఆత్మ విశ్వాసంతో మహిళలు రక్షించుకోవాలి

ఆత్మ విశ్వాసంతో మహిళలు రక్షించుకోవాలి

ఆత్మ విశ్వాసంతో మహిళలు రక్షించుకోవాలిప్రజాశక్తి – క్యాంపస్‌ శ్రీ పద్మావతి మహిళా విశ్వవిద్యాలయం లోని మహిళా అధ్యయన కేంద్రంవిభాగం వారు మార్చి 8 అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకొని నిర్వహిస్తున్న వారోత్సవాలలో భాగంగా సోమవారం స్థానిక బాలాజీ కాలనీ లో గల శ్రీ పద్మావతి బాలికోన్నత పాఠశాల లోని 9వ తరగతి విద్యార్థినులకు మహిళా రక్షణకై వున్న టోల్‌ ఫ్రీ నెంబర్స్‌, మొబైల్‌ యాప్స్‌ పై అవగాహనా కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మహిళా అధ్యయన కేంద్ర రీసెర్చ్‌ అసోసియేట్‌ డాక్టర్‌ కోనప్రభ మాట్లాడుతూ నేటి ఆధునిక సమాజంలో మహిళలు అన్ని రంగాలలోనూ రాణిస్తున్నప్పటికీ రోజు రోజుకి బాలికలు, మహిళలపై లైంగిక వేధింపులు, దాడులు, హత్యలు పెరిగిపోతూ ఉండడం బాధాకరమని అన్నారు. మహిళా రక్షణకై ఉన్నటువంటి టోల్‌ ఫ్రీ నెంబర్లు, మొబైల్‌ యాప్స్‌ పైన ప్రతి ఒక్కరికీ అవగాహన వుండడం ఎంతో అవసరమని అన్నారు. అకస్మాత్తుగా ఇబ్బందుల్లో పడినా ,తాము ప్రమాదంలో ఉన్నామని భావించినా ఎలాంటి భయాందోళనలకు గురికాకుండా ఆత్మవిశ్వాసంతో, అప్రమత్తంగా వ్యవహరించాలని, ధైర్యంగా రక్షణకై ఉన్న టోల్‌ ఫ్రీ నెంబర్స్‌, మొబైల్‌ యాప్స్‌ ను వినియోగించుకొని ప్రమాదం నుండి బయటపడాలన్నారు. ఈ కార్యక్రమంలో మహిళా రక్షణకై ఉన్న డయల్‌100, 112, 181, 139 మొదలైన టోల్‌ ఫ్రీ నెంబర్లు, ఏపీ పోలీస్‌ సేవా యాప్‌ , దిశా యాప్‌ ల పై విద్యార్థునులకు అవగాహన కలిగించారు. సైబర్‌ నేరాల బారిన పడకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి వివరించారు. ప్రధానోపాధ్యాయురాలు పద్మావతి, మహిళా అధ్యయన కేంద్ర రీసెర్చ్‌ అసిస్టెంట్‌ డాక్టర్‌ ఇంద్రాణిపాల్గొన్నారు.

➡️