ఆస్తి కోసం కన్నతల్లి గొంతు కోశారు

ఆస్తి కోసం కన్నతల్లి గొంతు కోశారు

ఆస్తి కోసం కన్నతల్లి గొంతు కోశారుప్రజాశక్తి – పిచ్చాటూరు (తిరుపతి జిల్లా) ఆస్తి తగాదాతో కన్నతల్లి గొంతు కోసిన కసాయి కొడుకు ఘటన తిరుపతి జిల్లా పిచ్చాటూరు మండలంలో చోటు చేసుకుంది. మండలంలోని అడవి కొడియంబేడు గ్రామంలో మంగళవారం మధ్యాహ్నం ఈ ఘటన చోటు చేసుకుంది. స్థానికుల సమాచారం మేరకు… రాజమ్మ(80)కు ఇద్దరు కుమారులు. ఆమెకు వ్యవసాయ భూమి 1.47 సెంట్లు ఉంది. మూడు భాగాలుగా విభజించి చిన్న కుమారుడైన కృష్ణారెడ్డికి 40 సెంట్లు, మిగిలిన భూమిని, తల్లి భాగము పెద్దకుమారునికి కలిపి 1.07 సెంట్లు రాసిచ్చింది. ఈ మేరకు పెద్ద కుమారుడు కొడుకైన హరిరెడ్డి పేరుతో రిజిస్ట్రేషన్‌ చేసి ఇచ్చింది. తల్లి భాగంలో చిన్న కుమారుడికీ వాటా రావాలని మూడు నెలలుగా గొడవ పడుతూనే ఉన్నారు. ఈ నేపథ్యంలో ఎస్‌ఐకు రాజమ్మ, పెద్ద కొడుకు కుమారుడు హరిరెడ్డి మంగళవారం ఫిర్యాదు చేశారు. విషయం తెలుసుకున్న రెండో కొడుకు కృష్ణారెడ్డి, అతని కొడుకులు పది నిమిషాల్లోనే ఇంటికి చేరుకుని మంగళవారం మధ్యాహ్నం రాజమ్మతో గొడవపడి కిరాతకంగా గొంతుకోసి చంపి పరారయ్యారు. సిఐ భాస్కర్‌నాయక్‌ మాట్లాడుతూ రాజమ్మను హత్య చేసిన ముద్దాయిలు చిన్న కుమారుడు కృష్ణారెడ్డి, కోడలు గౌరీ, మనవళ్లు ఇలంగో, పురుషోత్తంలపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామన్నారు. నిందితులు పరారీలో ఉన్నారు.

➡️