ఇంటివద్దనే పింఛన్లు ఇవ్వాలి : టిడిపి, జనసేన

ఇంటివద్దనే పింఛన్లు ఇవ్వాలి : టిడిపి, జనసేన

ఇంటివద్దనే పింఛన్లు ఇవ్వాలి : టిడిపి, జనసేన శ్రీకాళహస్తిలో… ఇంటివద్దనే పింఛన్లు ఇవ్వాలని శ్రీకాళహస్తి జనసేన జిల్లా కార్యదర్శి అంజూరు చక్రధర్‌ డిమాండ్‌ చేశారు. ప్రభుత్వ విభాగాల్లో లక్షల మంది అధికారులు, సిబ్బంది అందుబాటులో ఉన్నారని, వారి ద్వారా ఇంటింటికి వెళ్లి నగదు అందజేయాలన్నారు. ఈనెల 5లోపు పింఛన్ల పంపిణీ పూర్తి చేయాలన్నారు. – వెంకటగిరిలో మున్సిపల్‌ కమిషనర్‌కు మాజీ ఎంఎల్‌ఎ కురుగొండ్ల రామకృష్ణ ఆధ్వర్యంలో వినతిపత్రం అందజేశారు. లబ్దిదారులకు ఇంటివద్దనే పింఛన్లు ఇవ్వాలని డిమాండ్‌చేశారు. – తిరుపతిలో టిడిపి పార్లమెంట్‌ అధ్యక్షులు గొల్ల నరసింహయాదవ్‌ ఆధ్వర్యంలోకలెక్టర్‌కు వినతిపత్రం అందజేశారు. వలంటీర్లకు బదులుగా ప్రభుత్వ సిబ్బందితో పింఛన్‌దారులకు ఇంటి వద్దనే చెల్లించాలని కోరారు. ఖజానాలో డబ్బు అంతా జగన్‌రెడ్డి కాంట్రాక్టర్లకు దోచిపెట్టడం వల్లనే పింఛన్‌ ఇవ్వడం లేటయ్యిందన్నారు. ఆర్‌సి మునిక్రిష్ణ, రవినాయుడు, బిజి కృష్ణ యాదవ్‌, పుష్పావతి, సింధుజ, చేజర్ల మనోహర్‌ ఆచారి పాల్గొన్నారు. పుత్తూరు టౌన్‌లో టిడిపి పట్టణ అద్యక్షులు గాలి జీవరత్నం నాయుడు, పట్టణ ప్రధాన కార్యదర్శి ఎన్‌ఎన్‌ ధనపాల్‌ ఆధ్వర్యంలో టిపిఒకు వినతిపత్రం అందజేశారు. పిచ్చాటూరులో.. మండలాధ్యక్షులు తిరుమలరెడ్డి ఆధ్వర్యంలో ఎంపిడిఒ శ్రీనివాసులుకు వినతిపత్రం అందజేశారు.

➡️