ఉద్యోగ భద్రత కల్పించాలి

ఉద్యోగ భద్రత కల్పించాలిపజాశక్తి -దొరవారిసత్రం : ఎన్నో ఏళ్లుగా భద్రత లేని ఉద్యోగాల్లో కొనసాగుతున్న తమను క్రమబద్ధీకరించాలని సమగ్ర శిక్ష అభియాన్‌ కాంట్రాక్టు ఉద్యోగులు డిమాండ్‌ చేశారు. మంగళవారం దొరవారిసత్రం మండల విద్యాశాఖ కార్యా లయం ఎదుట మండల పరిధిలోని సిఎంఆర్‌టి లు, ఏ ఆర్‌టి, డిఈఓ, మెసెంజర్‌లు డిమాండ్లతో కూడిన ప్లకార్డులు ప్రదర్శించి నిరసన తెలిపారు. సుప్రీం కోర్టు తీర్పు ప్రకారం సమాన పని సమాన వేతనం చెల్లించాలని, ప్రతి నెల ఒకటవ తేదీ జీతాలు జమ చేయాలని, ఉద్యోగ భద్రత కల్పిస్తూ క్రమబద్ధీకరించాలని, ఐఎంటిఎస్‌ కింద జీతాలు అందించాలని, జిపిఎఫ్‌ ఈఎస్‌ఐ సౌకర్యం కల్పించాలని కోరుతూ నిరసన వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో సిఎంఆర్‌టి లు ఎం సుబ్రహ్మణ్యం, సిహెచ్‌ బత్తయ్య, శ్రీనివాసులు, చంద్రయ్య, కే సుబ్రహ్మణ్యం, వెంకట కష్ణయ్య ఖాదర్‌ బాషా, సురేఖ, మెసెంజర్‌ వెంకటేశ్వర్లు ఐఇఆర్టి టీచర్లు పాల్గొన్నారు.గూడూరు టౌన్‌ : తమకు ప్రభుత్వం ఉద్యోగ భద్రత కల్పించా లని కోరుతూ గూడూరు పట్టణంలోని మండల విద్య వనరుల కేంద్రం వద్ద ఫ్ల కార్డులతో మంగళవారం సమగ్ర శిక్షా అభియాన్‌ ఉద్యోగులు నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భం గా వారు మాట్లాడుతూ తమ డిమాండ్లను వెంటనే పరిష్కరించాలని కోరారు. తమ న్యాయ పరమైన డిమాండ్ల కోసం ఈ నెల 20న చేపట్టే సమ్మెకు ఉపాధ్యాయ సంఘాలు అన్ని మద్దతు తెలపాలని కోరారు.

➡️