కానిస్టేబుల్‌ నుంచి ఎస్‌ఐగా ఉద్యోగోన్నతి

కానిస్టేబుల్‌ నుంచి ఎస్‌ఐగా ఉద్యోగోన్నతి

కానిస్టేబుల్‌ నుంచి ఎస్‌ఐగా ఉద్యోగోన్నతిప్రజాశక్తి-చిన్నగొట్టిగల్లు: స్థానిక దండారు వాండ్లపల్లికి చెందిన ఎం పూర్ణ చంద్రిక కాని స్టేబుల్‌ గా పని చేస్తూ ఇటీవల జరిగిన ఎస్‌ఐ పరీక్షల్లో నెగ్గి ఎస్‌ఐగా ఉద్యోగోన్నతి సాధించారు. ఎం.ధనలక్ష్మి చిరంజీవి తల్లిదండ్రులకు జన్మించిన మొదటి కుమార్తె ఎం పూర్ణ చంద్రిక, 2023 ఎస్‌ఐ పరీక్షలలో 218 మార్కులతో ఓపెన్‌ కేటగిరిలో ఎంపికయ్యారు. తిరుపతి వెస్ట్‌ పోలీస్‌ స్టేషన్లో విధులు నిర్వహిస్తున్న ఎం పూర్ణ చంద్రిక 2014 బ్యాచ్‌ కి చెందినవారు. మూడు సంవత్సరాల వయసున్నప్పుడే తల్లి మతి చెందడంతో పెదనాన్న ప్రసాద్‌ ,పెద్దమ్మ సుబ్బమ్మ చేరదీసి చదివించారు. ఇంటర్‌ విద్యాభ్యాసం పూర్తికాగానే రమేష్‌తో వివాహమైంది. వీరికి ఒక అమ్మాయి ఇందుప్రియ , అబ్బాయి హర్షవర్ధన్‌ ఉన్నారు. అబ్బాయి తొమ్మిదవ తరగతి, అమ్మాయి ఆరవ తరగతి చదువుతున్నారు. భర్త రమేశ్‌, అత్త సరోజమ్మ ప్రోత్సాహంతో చదువు కొనసాగిస్తూ జీవితం సాగిస్తోంది. మహిళా పోలీసుగా విధులు నిర్వహిస్తూ సెలవు పై సంవత్స రం పాటు కాకినాడ లోని శ్యామ్‌ ఇనిస్టిట్యూట్‌లో కోచింగ్‌ తీసుకున్నారు. ఎస్‌ఐగా ఎంపిక కావడంతో పలువురు అభినందించారు.

➡️