కుప్పానికి ప్రత్యేక మ్యానిఫెస్టోమోడల్‌ టౌన్‌గా తీర్చిదిద్దుతాం రూ.100 కోట్ల వ్యయంతో శిల్పారామంసొంత నియోజకవర్గానికి బాబు ‘వరాలు’

కుప్పానికి ప్రత్యేక మ్యానిఫెస్టోమోడల్‌ టౌన్‌గా తీర్చిదిద్దుతాం రూ.100 కోట్ల వ్యయంతో శిల్పారామంసొంత నియోజకవర్గానికి బాబు 'వరాలు'

కుప్పానికి ప్రత్యేక మ్యానిఫెస్టోమోడల్‌ టౌన్‌గా తీర్చిదిద్దుతాం రూ.100 కోట్ల వ్యయంతో శిల్పారామంసొంత నియోజకవర్గానికి బాబు ‘వరాలు’ప్రజాశక్తి – తిరుపతి బ్యూరో, కుప్పం ‘కుప్పం అంటే నేను, నేనంటే కుప్పమనే గుర్తుకొస్తుంది.. ఆ విధంగా 35 ఏళ్లు ఆదరించారు. ఎనిమిదోసారి పోటీ చేస్తున్నా. లక్ష మెజార్టీ లక్ష్యంగా పనిచేస్తున్నారు. లక్ష మెజార్టీ తీసుకురండి, వైసిపి అభ్యర్థికి డిపాజిట్లు కూడా రాకూడదు. ఆ విధంగా రేయింబవళ్లు పనిచేయండి. మీ బాధ్యత నేను తీసుకుంటా.’ అని సొంత నియోజకవర్గమైన కుప్పంలో టిడిపి అధినేత నారా చంద్రబాబునాయుడు పార్టీ కార్యకర్తలు, నాయకుల మధ్య ఎన్నికల శంఖారావాన్ని పూరించారు. నియోజకవర్గానికి ప్రత్యేక మ్యానిఫెస్టోను ప్రకటించారు. రాష్ట్రమంతా రెండింతల అభివృద్ధి చేస్తే, కుప్పానికి మూడింతలు చేస్తానన్నారు. హైదరాబాద్‌నుంచి బెంగుళూరుకు ప్రత్యేక విమానంలో వచ్చిన చంద్రబాబునాయుడు, రోడ్డు మార్గంలో కుప్పంకు చేరుకున్నారు. సోమవారం ఉదయం నియోజకవర్గ పార్టీ ముఖ్య నేతలతో అంతర్గత సమావేశం నిర్వహించారు. మహిళలతో ప్రత్యేక సమీక్ష నిర్వహించారు. అనంతరం బస్టాండ్‌ సమీపంలో ఎన్టీఆర్‌ విగ్రహం వద్ద ఎన్నికల శంఖారావం పూరించారు. ‘కుప్పాన్ని ఎడ్యుకేషన్‌, నాలెడ్జి హబ్‌గా తీర్చిదిద్దుతా. కుప్పంలో ఇంజినీరింగ్‌ కాలేజీ తీసుకొస్తా. ప్రతి ఊరికి రోడ్డు, నీళ్లు ఇస్తా. బెంగుళూరు నుంచి నాలుగు లైన్స్‌ ఎక్స్‌ప్రెస్‌ లైన్‌ నిర్మిస్తా. చిత్తూరు జిల్లాలోనే కుప్పంను విద్యా కేంద్రంగా వర్థిల్లేలా చేస్తా. బెంగుళూరు నుంచి, ఇతర ప్రాంతాల నుంచి కుప్పంకు వచ్చి చదువుకునేలా చేస్తా. రామకుప్పం నుంచి తమిళనాడుకు, కుప్పం నుంచి కృష్ణగిరికి, కుప్పం – బెంగుళూరుకు అనుసంధానం చేస్తా. అన్ని కులాలకు కమ్యూనిటీ సెంటర్లు నిర్మిస్తా.. వంద కోట్ల వ్యయంతో శిల్పారామం నిర్మించి, గ్రానైట్‌ను సద్వినియోగం చేసుకునేలా ఏమందిరానికైనా దేవున్ని ఇక్కడనుంచే తయారుచేసేలా చూస్తా. 150 పడకల ఆస్పత్రిని 300 పడకలుగా చేస్తా. పాలారును పూర్తి చేసి హంద్రీనీవా నీరు ప్రతి ఎకరాకు నీళ్లు వచ్చేలా బాధ్యత తీసుకుంటా. ఈ 35 ఏళ్లలో జరిగిన అభివృద్ధి ఓ ఎత్తయితే, రాబోయే ఐదేళ్లలో మరో ఎత్తు. ఇక్కడ చదవుకున్న విద్యార్థులకు విదేశాల్లో సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగాలు ఇప్పించి వర్క్‌ఫ్రం హోం అవకాశం కల్పిస్తా. ప్రశాంతమైన కుప్పంలోఎపుడూ పచ్చదనం ఉండాలి. అయితే వైఎస్‌ఆర్‌ హయాంలో అరాచకం రాజ్యమేలింది. పుంగనూరుకు చెందిన పెద్దిరెడ్డి హవా, దౌర్జన్యం అక్రమాలుపెరిగాయి. అధికారంలోకి వచ్చిన వెంటనే వడ్డీతో సహా చెల్లిస్తా. కుప్పంకు వచ్చిన మొదట్లో రోజుకు వెయ్యి లీటర్ల పాలు ఉత్పత్తి అయ్యేది. ప్రతి ఇంటికి సీమ ఆవులు రెండు ఇచ్చి రోజుకు నాలుగు లక్షల లీటర్ల పాలు ఉత్పత్తయ్యేలా చూశా. భవిష్యత్‌లో పది లక్షల లీటర్లు తీసుకొచ్చేలా ప్రణాళిక ఉంది. కుప్పం నియోజకవర్గానికే ప్రత్యేకమైన మ్యానిఫెస్టో తయారు చేసి, ఆ ప్రకారం అభివృద్ధి చేస్తా. రాష్ట్ర వ్యాప్తంగా రెండింతలు అభివృద్ధి చేస్తే, కుప్పంలో మూడింతలు చేస్తా. కుప్పంలో పండిన పంటలకు గిట్టుబాటు ధర తెచ్చుకునేలా అన్ని మండలాల్లో కోల్డ్‌ స్టోరేజీలు నిర్మిస్తా. ఐదేళ్ల క్రితం ఇక్కడ పండించిన కూరగాయలు ఎగుమతి చేసుకునేలా విమానాశ్రయం తీసుకురావాలని చూశా. అప్పుడు సాధ్యం కాలేదు. మళ్లీ అధికారంలోకి వస్తే కుప్పంకు విమానాశ్రయం తీసుకొస్తా’ అన్నారు. వ్యవసాయాధారిత పరిశ్రమలు తీసుకొచ్చి, రైతులనే పారిశ్రామికవేత్తలను చేస్తానన్నారు. వేదికపై చిత్తూరు పార్లమెంట్‌ ఎంపి అభ్యర్థి దుగ్గిమళ్ల ప్రసాద్‌రావు, కుప్పం ఇన్‌ఛార్జి, ఎంఎల్‌సి కంచర్ల శ్రీకాంత్‌, పిఎస్‌ మునిరత్నం, గౌనివారి శ్రీనివాసులు, చిత్తూరు పార్లమెంట్‌ నియోజకవర్గ అధ్యక్షులు సిఆర్‌ రాజన్‌, డాక్టర్‌ సురేష్‌, చంద్రశేఖర్‌, డాక్టర్‌ వెంకటేష్‌, రాజ్‌కుమార్‌, గోపీనాథ్‌ పాల్గొన్నారు

➡️