గ్రామ బహిష్కరణ పై స్పందించాలి: బాలరాజు

గ్రామ బహిష్కరణ పై స్పందించాలి: బాలరాజు

గామ బహిష్కరణపై స్పందించాలి: బాలరాజుప్రజాశక్తి- తిరుపతి(మంగళం) తన కుటుంబాన్ని గ్రామంలో నిర్వహించ తలపెట్టిన పూజలకు మహిళ సంఘాల నిధులు ఎందుకు వినియోగిస్తున్నారని ప్రశ్నించిన దానికై గ్రామ బహిష్కరణ చేశారని, గ్రామ బహిష్కరణపై ప్రభుత్వ ఉన్నతాధికారులు స్పందించి జోక్యం చేసుకోవాలని బాధితుడు సినీ జానపద గేయ రచయిత బాలరాజు విజ్ఞప్తి చేశారు. ఆదివారం తిరుపతి ప్రెస్‌క్లబ్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో బాలరాజు మాట్లాడుతూ ఏర్పేడు మండలంలోని పరమాలపల్లి గ్రామంలో నివసిస్తున్న తన కుటుంబాన్ని గ్రామానికి సంబంధించిన తొమ్మిది మంది గ్రామ ప్రజలను రెచ్చగొట్టి గ్రామ బహిష్కరణ చేశారన్నారు. గ్రామంలో దెయ్యాలు తిరుగుతున్నాయన్న నెపంతో గ్రామంకు నాలుగు వైపులా శక్తి రాళ్లు నాటుకోవడానికి మహిళా సంఘాల నిధులు వాడుకోవడాన్ని వ్యతిరేకించడంతోనే తన తోడబుట్టిన వారిని సైతం తన ఇంటికి రాకుండా అడ్డుకుంటున్నారని, వయోవద్ధులైన తల్లిదండ్రులు పాలు తెచ్చుకోవడానికి కూడా అడ్డుకుంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. దీనిపై ప్రభుత్వ ఉన్నతాధికారులు స్పందించి తమ గ్రామాన్ని సందర్శించి గ్రామ బహిష్కరణ సమస్యను పరిష్కరించాలని విజ్ఞప్తి చేశారు.

➡️