డాక్టర్‌ పి. శరత్‌ చంద్రకు నేపాల్‌ ఆహ్వానం

డాక్టర్‌ పి. శరత్‌ చంద్రకు నేపాల్‌ ఆహ్వానం

డాక్టర్‌ పి. శరత్‌ చంద్రకు నేపాల్‌ ఆహ్వానంప్రజాశక్తి – క్యాంపస్‌మహా శివరాత్రి సందర్భంగా మార్చ్‌ 6,7,8 వ తేదీలలో నేపాల్‌ లోని కాట్మండు నగరంలో పశుపతినాథ్‌ ఆలయంలో జరిగే శివరాత్రి ఉత్సవాలలో భరతనాట్య ప్రదర్శనకు గాను తిరుపతికి చెందిన ప్రముఖ భరతనాట్య కళాకారులు డాక్టర్‌ పి. శరత్‌ చంద్రకు పసుపతినాథ్‌ దేవస్థానం నుండి ఆహ్వానం అందింది. ఈ మేరకు వారు 6 వ తేదీ ఢిల్లీ నుంచి కాట్మండు బయలుదేరుతునట్లు శరత్‌ చంద్ర తెలిపారు. దేశ విదేశాల్లో భారతీయ కలలను ప్రదర్శిస్తూ, భారతీయ సంస్కతి, సాంప్రదాయ, ప్రాచీన కళలను వాటి విశిష్టతను ప్రపంచ దేశాలకు భారతదేశం యొక్క గొప్పతనాన్ని తన వంతు భాగంగా తన నత్యం తో తెలియచేయడం తన పూర్వ జన్మసుకతం గా భావిస్తున్నట్లు శరత్‌ చంద్ర తెలిపారు. ఈ అవకాశం కల్పించిన టువంటి పశుపతి క్షేత్ర వికాస్‌ కొష్‌ ,పశుపతి డెవలప్మెంట్‌ ,శివరాత్రి వ్యవస్తాపం సమితికి కతజ్ఞతలు తెలిపారు.

➡️