తిరుపతిని రాజధాని చేయడమే లక్ష్యం: చింతామోహన్‌

తిరుపతిని రాజధాని చేయడమే లక్ష్యం: చింతామోహన్‌

తిరుపతిని రాజధాని చేయడమే లక్ష్యం: చింతామోహన్‌ ప్రజాశక్తి-తిరుపతి(మంగళం)తిరుపతిని రాజధాని చేయడమే తన లక్ష్యమని, ఎన్ని అడ్డంకులు ఎదురైనా పోరాడతానని కేంద్ర మాజీ మంత్రి చింతామోహన్‌ స్పష్టం చేశారు. కేంద్రంలో కాంగ్రెస్‌ అధికారంలోకి రావడం ఖాయమని, మే 10న తిరుపతి రాజధానిగా శంకుస్థాపన చేస్తామన్నారు. బుధవారం తిరుపతి ప్రెస్‌క్లబ్‌ లో విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ముఖ్యమంత్రిగా జగన్మోహన్‌రెడ్డికి ప్రజలు అవకాశం ఇచ్చినా అస్తవ్యస్థ పాలనతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారన్నారు. కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం మతతత్వాన్ని రెచ్చగొట్టేలా పరిపాలన చేస్తూ, ప్రభుత్వ వ్యవస్థను కార్పొరేట్లకు కట్టబెడుతోందన్నారు. ఎక్కడ తన లొసుగులు బయట పడతాయోనని మోడీ వద్ద జగన్మోహన్‌రెడ్డి లొంగిపోయాడన్నారు. చంద్రబాబు అవినీతి చిట్టా కూడా మోడీ వద్ద ఉండడంతో ఆయనా సరెండర్‌ అయ్యారన్నారు. రానున్న సార్వత్రిక ఎన్నికల్లో కేంద్రంలోని బిజెపి ప్రభుత్వానికి, రాష్ట్రంలోని వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌కు ప్రజలు తగిన బుద్ధి చెప్పాలన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్‌ తిరుపతి పట్టణ అధ్యక్షులు గోపి, తేజవతి, శాంతి యాదవ్‌, మునిశోభ, షేక్‌ జావేద్‌, వెంకటేష్‌ గౌడ్‌ పాల్గొన్నారు.

➡️