తిరుపతి అభివృద్ధే ధ్యేయం

తిరుపతి అభివృద్ధే ధ్యేయం

తిరుపతి అభివృద్ధే ధ్యేయంతిరుపతి టౌన్‌ : తిరుపతి అభివృద్దే ధ్యేయంగా పని చేస్తామని తిరుపతి ఎమ్మెల్యే, టీటీడి చైర్మెన్‌ భూమన కరుణాకర రెడ్డి స్పష్టం చేసారు. తిరుపతి మునిసిపల్‌ కార్పొరేషన్‌ పరిధిలో నాలుగు ప్రాంతాల్లో పూర్తి చేసిన అభివృద్ధి పనులను బుధవారం ఎమ్మెల్యే భూమన కరుణాకర రెడ్డి ముఖ్య అతిథిగా, తిరుపతి నగరపాలక సంస్థ మేయర్‌ డాక్టర్‌ శిరీష ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే భూమన మాట్లాడుతూ భవిషత్తులో తిరుపతి నగరం మరింత అభివద్ది సాధించాలనే లక్ష్యంతో మునిసిపల్‌ కార్పొరేషన్‌ కౌన్సిల్‌, అధికారుల సహకారంతో ముందుకు వెలుతున్నామన్నారు. తిరుపతి నగరపాలక సంస్థ మేయర్‌ డాక్టర్‌ శిరీష మాట్లాడుతూ తిరుపతి అభివద్దికి కౌన్సిల్‌ సభ్యులు అందరూ సమిష్టిగా కృషి చేస్తున్నారని తెలిపారు. ఈ కార్యక్రమాల్లో కార్పొరేటర్లు ఆధం రాధాకష్ణ రెడ్డి, ఆదం లీలావతి, దొడ్డారెడ్డి ప్రవళ్ళికా రెడ్డి, స్టాండింగ్‌ కౌన్సిల్‌ సభ్యులు ఎస్‌.కె.బాబు పాల్గొన్నారు.

➡️