నేటి నుండి పశువులకు టీకాలు

నేటి నుండి పశువులకు టీకాలు

నేటి నుండి పశువులకు టీకాలుప్రజాశక్తి – పిచ్చాటూరు: జాతీయ పశు వ్యాధి నియంత్రణ పథకం కింద ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం చేపట్టిన ఉచిత గాలి కుంటు వ్యాధి నివారణ టీకాల కార్యక్రమం జనవరి 2వ తేదీ నుంచి 31వ తేదీ వరకు మండలంలోని అన్ని గ్రామాలలో నిర్వహిస్తామని మండలంలోని పశుసంవర్థక శాఖ సిబ్బంది రెండు గ్రూపులుగా షెడ్యూల్‌ ప్రకారం డాక్టర్‌ పి ధనంజయులు, డాక్టర్‌ ఎన్‌ మంజుల ఆధ్వర్యంలో నిర్వహించనున్నారు. వ్యాధి బారిన పడిన పశువులలో తీవ్రమైన జ్వరం , నోటి నుండి చొంగ కారటం, చూడి పశువులు ఈశుకుపోవడం, పాల ఉత్పత్తి తగ్గిపోవడం, పాలు తాగే దూడలలో వ్యాధి నిరోధక శక్తి తగ్గి మరణాలు సంభవించి పాడి రైతులు ఆర్థికంగా ఎక్కువ నష్టం జరిగే అవకాశం ఉందని, ఎద్దులలో పని సామర్థ్యం కూడా తగ్గవచ్చని పశువైద్యాధికారులు తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం పాడి రైతులకు ఆర్థిక నష్టం జరగకుండా నివారించేందుకు ఉచిత టీకాలు ఇవ్వనున్నారు. రైతు సోదరులు టీకా వేస్తే (పాలు తగ్గుతాయని) అపోహ వీడి దూడలకు , అన్ని వయస్సు చూలు పాలిచ్చే పశువులకు టీకాలు వేయించాలని పశుసంవర్థక శాఖ పిచ్చాటూరు వైద్యాధికారులు తెలిపారు.

➡️