పబ్లిక్‌ పరీక్షల మార్కులే ఉన్నత విద్యకు తొలిమెట్టు ..

పబ్లిక్‌ పరీక్షల మార్కులే ఉన్నత విద్యకు తొలిమెట్టు

పబ్లిక్‌ పరీక్షల మార్కులే ఉన్నత విద్యకు తొలిమెట్టు .. ప్రజాశక్తి- తిరుపతి సిటీ : పదో తరగతి పబ్లిక్‌ పరీక్షల్లో సాధించే మార్కులే ఉన్నత విద్యకు తొలి మెట్టు అని భాష్యం విద్యాసంస్థల అధినేత భాష్యం రామకష్ణ అన్నారు. 2023 -24 విద్యా సంవత్సరంలో పదవ తరగతి పరీక్షలకు సిద్ధమవుతున్న తిరుపతి జోన్‌ భాష్యం విద్యార్థులకు అవగాహన కలిగించడానికి స్థానిక బైరాగిపట్టెడ లో ఉన్న సిపిఐ ఫంక్షన్‌ హాల్‌ లో శుక్రవారం భాష్యం విద్యాసంస్థల అధినేత రామకష్ణ,నిర్దేశకుల మైఖేల్‌ రాజు,సీఈవో హనుమంత్‌, జోనల్‌ ఇన్చార్జి లక్ష్మణ్‌ సమక్షంలో అవగాహన నిర్వహించారు. ఈ సందర్భంగా భాష్యం పాఠశాల చైర్మన్‌ భాష్యం రామకష్ణ మాట్లాడుతూ విద్యార్థులకు పదో తరగతి పబ్లిక్‌ పరీక్షల్లో సాధించే మార్కులే ఉన్నత విద్యకు తోలమెట్టు అని,దీని దష్టిలో పెట్టుకుని పదవ తరగతి పబ్లిక్‌ పరీక్షల్లో గత ఏడాది కంటే ఈ ఏడాదిలో 100 శాతం ఉత్తీర్ణత లక్ష్యంగా ఉంచుకోవాలని ఉపాధ్యాయులకు,విద్యార్థులకు సూచించారు. మంచి ప్రణాళికలు సిద్ధం చేయాలని సబ్జెక్టుల వారీగా నైపుణ్యాన్ని పెంచి ఉత్తీర్ణత శాతాన్ని పెంచే లక్ష్యంతో ముందుకెళ్లాలని తెలిపారు.ఉత్తమ ఫలితాలతో పాటు అత్యధిక మార్కులు సాధించాలని ప్రత్యేక తరగతులు నిర్వ హించా లని తెలిపారు. చదువు లో వెనుకబడిన విద్యార్థు లపై ప్రత్యేక దష్టి పెట్టి పరీక్షలకు సన్నద్ధం చేయాల న్నారు. విద్యార్థు లు 100 శాతం ఉత్తీర్ణత సాధించే దిశగా ఉండా లన్నారు. పరీక్షల తేదీ ఖరారు అయిందని ఇంక ఉన్న కొద్ది సమయంలో పరీక్షలకు ఎలా ప్రిపేర్‌ కావా,లో ఆరోగ్యం విషయంలో తీసుకోవలసిన జాగ్రత్తల గురించి, ఒత్తిడిని ఎలా అధిగమించాలి పరీక్ష రాసే సమయంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో, మొదలైన విషయాలను గురించి విద్యార్థులకు తెలిపారు. వారు కోరుకున్న మంచి భవిష్యత్తుకు ఇదే పునాది అని అందరూ మంచిగా చదివి విజయ శిఖరం సాధించాలని తెలిపారు. తర్వాత విద్యార్థులు కలిసి చైర్మన్‌ భాష్యం రామకష్ణ తో ఫోటో తీసుకున్నారు. ఈ కార్యక్రమంలో భాష్యం పాఠశాల ప్రిన్సిపాల్స్‌ శ్రీనివాసులు బాలాజీ ఇతర ఉపాధ్యాయులు పాల్గొన్నారు.

➡️