భువనిక..సాటిలేదిక..!ఇండియా బుక్‌ ఆఫ్‌ రికార్డ్స్‌లో స్థానం

భువనిక..సాటిలేదిక..!ఇండియా బుక్‌ ఆఫ్‌ రికార్డ్స్‌లో స్థానం

భువనిక..సాటిలేదిక..!ఇండియా బుక్‌ ఆఫ్‌ రికార్డ్స్‌లో స్థానంప్రజాశక్తి-తిరుపతి(మంగళం)చిన్నారి భువనికకు ఐదు సంవత్సరాలు. ఇంత చిన్న వయసులోనే భగవద్గీత శ్లోకాలు, రాముడి వంశవక్ష చరిత్రను, అన్నమయ్య సంకీర్తనలను అలవోకగా ఆలపిస్తూ అందరిని అబ్బురపరుస్తోంది తిరుపతి సత్యనారాయణ పురానికి చెందిన భువనిక అంజూరు. చిన్నారి తన టాలెంట్‌ తో ఇండియా బుక్‌ ఆఫ్‌ రికార్డ్స్‌ లో స్థానం సంపాదించిందని భువనక తల్లి కవిత మీడియాకు తెలిపారు. శనివారం తిరుపతి ప్రెస్‌ క్లబ్‌లో విలేకరుల సమావేశంలో తాను చదువుతున్న ఫ్యూచర్‌ అండ్‌ ప్లే స్కూల్‌ అకాడమిక్‌ హెడ్‌ స్వర్ణలత, తల్లి కవితలతో కలిసి భూమిక మీడియా ముందు తాను నేర్చుకున్న భగవద్గీత శ్లోకాలను, రాముడి వంశవక్ష చరిత్రను, అన్నమయ్య సంకీర్తనలను ఆలపించి తన టాలెంట్‌ ప్రదర్శించింది.

➡️